Nithin : నితిన్ చేసిన పని వల్లే బన్నీ స్టార్ హీరో అయ్యాడా.. ఇన్నాళ్లకు బయట పడ్డ నిజం..!
NQ Staff - February 22, 2023 / 09:40 AM IST

Nithin : ఇప్పుడు అల్లు అర్జున్ ఏ రేంజ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆయన చేతిలో ఇప్పుడు అన్నీ బడా ప్రాజెక్టులే ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం డబుల్ అయిపోయింది. అయితే అసలు బన్నీ స్టార్ హీరో కావడానికి కారణం నితిన్ చేసిన పనే అంట.
ఆయన పొరపాటు వల్లే బన్నీ స్టార్ హీరో అయ్యాడని ఇన్నాళ్లకు ఓ నిజం బయట పడింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసు కుందాం. బన్నీని అప్పట్లో స్టార్ హీరోను చేసిన సినిమా ఆర్య. ఈ మూవీ తర్వాతనే బన్నీ వెనక్కు తిరిగి చూసుకోకుండా దూసుకు పోయాడు. అయితే దీనికి సుకుమార్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.
నితిన్ వల్లే..
అప్పట్లో నితిన్ జయం హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి నితిన్ తండ్రి ఆర్య సినిమా కథను విని ఎలాగైనా తన కొడుకుతో చేయించాలని అనుకున్నాడు. అనుకున్నట్టు గానే దిల్ రాజు వద్దకు వెళ్లాడు. కానీ సుకుమార్ ఆ సినిమాను వెంటనే తీయాలనే పట్టుదలతో ఉన్నాడు.
కానీ నితిన్ చేతిలో అప్పటికే అరడజను సినిమాలు ఉన్నాయి. దాంతో నితిన్ డేట్లు అస్సలు ఖాళీ లేవు. చేసేది లేక ఆ సినిమాను వదులుకున్నాడు నితిన్. దాంతో ఈ కథ అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు బన్నీ దగ్గరకు వచ్చి ఆగింది. కట్ చేస్తే ఆ మూవీ పెద్ద హిట్ అయి బన్నీని ఓవర్ నైట్ స్టార్‌ను చేసి పడేసింది.