Nikki Tamboli : బెంజ్ కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ..సోకులు ఆరబోస్తూ తెగ స్టిల్స్ ఇచ్చేసిందిగా..!
NQ Staff - June 29, 2022 / 10:39 AM IST

Nikki Tamboli : నిక్కీ తంబోలి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హిందీ బిగ్‌బాస్ 14లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఈ అమ్మడు షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నిక్కీ తంబోలి కాంచన 3 సినిమాతో సూపర్ క్రేజ్ సాధించింది హాట్ బ్యూటీ.. మూవీస్ తో పాటు సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తోంది.

Nikki Tamboli latest photos
నిక్కీ జోరు..
కాంచన 3 తో పాటు నిక్కీ తంబోలి టాలీవుడ్ లో యంగ్ హీరో శ్రీవిష్ణు సరసన తిప్పరామీసం సినిమాలో కూడా నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది నిక్కీ తంబోలీ, స్కిన్ షోలో తగ్గేది లేదు అంటోంది. హాట్ హాట్ ఫోటోస్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతోంది. పొట్టి పొట్టి డ్రెస్ లతో.. సొగసుల జాతర చేస్తుంటుంది నిక్కీ.
తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త కారు కొనుగోలు చేసింది. మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొన్నట్లు తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడిచింది. ఈ మేరకు ఆమె కారుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఈ స్పెషల్ డేను సెలబ్రెట్ చేసుకున్న ఫొటోలను కూడాఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

Nikki Tamboli latest photos
వీటికి ‘ఎప్పుడు నా ఎదుగుదలలో తోడుగా ఉన్నారు. పడిపోకుండ సపోర్టు ఇచ్చారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఎప్పటికి నేను మీ లిటిల్ గర్ల్‌నే’ అంటూ తండ్రితో దిగిన కారు ఫొటోలను షేర్ చేసింది. కాగా నిక్కీ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఈ కారు ధర దాదాపు రూ. 85.80 లక్షల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయల మధ్యలో ఉండోచ్చని అంచనా.
నిక్కీ తంబోలి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే తెలుగు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు దక్షిణాదిలో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ‘నాకిప్పటికీ గుర్తుంది, ఓ సౌత్ డైరెక్టర్ నాతో ప్రవర్తించిన తీరు నాకస్సలు నచ్చలేదు. సెట్స్‌లో నాతోపాటున్న డ్యాన్సర్స్ అందరినీ మెచ్చుకుంటున్నాడు. నన్ను మాత్రం ఎక్కడినుంచి వస్తారో నీలాంటి వాళ్లు? అంటూ చులకన చేసి మాట్లాడాడు అని చెప్పుకొచ్చింది.

Nikki Tamboli latest photos

Nikki Tamboli latest photos

Nikki Tamboli latest photos

Nikki Tamboli latest photos

Nikki Tamboli latest photos