Nikhil : నిఖిల్ సిద్దార్ధ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడహో.!

NQ Staff - August 22, 2022 / 09:21 PM IST

Nikhil : నిఖిల్ సిద్దార్ధ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడహో.!

Nikhil : ‘ఏదో ఒక్కసారి నక్క తోక తొక్కినట్లు లక్కు కలిసొచ్చిందంతే..’ అనేశారు ‘కార్తికేయ-2’ సినిమా విడుదలైన తొలి రోజు చాలామంది. రెండో రోజు హిందీలో సినిమా దుమ్ము రేపడంపైనా చాలా వెటకారాలు చూశాం. కానీ, రోజు రోజుకీ ‘కార్తికేయ-2’ ప్రభంజనం మరింత పెరుగుతోంటే, యంగ్ హీరో నిఖిల్ మీద విమర్శలు చేసినోళ్ళంతా కాస్త తగ్గారు.

Nikhil pan india star with Karthikeya 2 movie

Nikhil pan india star with Karthikeya 2 movie

ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. బాలీవుడ్ ప్రముఖులు ‘కార్తికేయ-2’ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మన టాలీవుడ్ హీరోల కంటే గొప్పగా ‘కార్తికేయ-2’ సినిమా గురించి మంచి మాటలు చెబుతున్నారు. వాళ్ళే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

తెలుగునాట తగ్గింది.. నార్త్‌లో దుమ్ము రేపుతోంది..

తెలుగునాట ‘కార్తికేయ-2’ హవా కాస్త నెమ్మదించినట్లే కనిపిస్తోంది. కానీ, నార్త్ ఇండియాలో మాత్రం హిందీ వెర్షన్ దుమ్ము రేపేస్తోంది. వీకెండ్ అదరహో అనే స్థాయిలో వసూళ్ళను రాబట్టింది. చాలా చిన్న సినిమా ఇది బడ్జెట్, రిలీజ్ పరంగా.

కానీ, ‘కార్తికేయ-2’ సినిమా అన్ని చోట్లా బయ్యర్లకు భారీ లాభాల్ని తీసుకురావడంతో, నిఖార్సయిన పాన్ ఇండియా హీరో.. అంటూ యంగ్ హీరో నిఖిల్ గురించి బాలీవుడ్ మీడియా కొనియాడుతోంది. ఇలా బాలీవుడ్ ప్రముఖుల నుంచి వస్తున్న ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు నిఖిల్.

నిజానికి, సినిమా రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు పడింది ‘కార్తికేయ-2’ టీమ్. మరీ ముఖ్యంగా నిఖిల్, చాలా చాలా ఆవేదన చెందాడు. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్.. తదనంతర పరిణామాలు చూసి.. నిఖిల్ ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నాడో ఊహించడం అంత తేలికేమీ కాదు. నిఖిల్ నయా పాన్ ఇండియా స్టార్.. అనడం నిస్సందేహం.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us