Karthikeya 2 : కాస్త తగ్గి, మళ్ళీ పెరిగిన ‘కార్తికేయ-2’ హిందీ వసూళ్ళు.!

NQ Staff - August 24, 2022 / 06:54 PM IST

Karthikeya 2 : కాస్త తగ్గి, మళ్ళీ పెరిగిన ‘కార్తికేయ-2’ హిందీ వసూళ్ళు.!

Karthikeya 2 : ఏడు లక్షల రూపాయలతో మొదలైన ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ ప్రయాణం, అత్యధికంగా 4.07 కోట్లకు చేరుకుంది.. అదీ ఒక్కరోజు వసూళ్ళ విషయంలో. రెండో ఆదివారం ఈ రికార్డు స్థాయి వసూళ్ళను ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ రాబట్టిన విషయం విదితమే.

Nikhil Karthikeya 2 movie collections

Nikhil Karthikeya 2 movie collections

అయితే, సోమవారం వసూళ్ళు బాగా తగ్గాయ్. కేవలం 98 లక్షలతో సరిపెట్టింది ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్. రెండో వారంలో ఈ వసూళ్ళు అంటే నిజానికి చిన్న విషయం కాదు. కాగా, మంగళారం మళ్ళీ పుంజుకుంది హిందీ వెర్షన్ ‘కార్తికేయ-2’.

మొత్తంగా ఇప్పటివరకు 17.45 కోట్లు..

నిఖిల్ సిద్దార్ధ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ-2’ ఇప్పటివరకు కేవలం హిందీ వెర్షన‌తోనే 17.45 కోట్ల రూపాయలు వసూలు చేయడం గమనార్హం.

సోమవారం 98 లక్షలు వసూలు చేయగా, మంగళవారం ఇంకాస్త తగ్గొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, మంగళవారం వసూళ్ళు 1.15 కోట్లు కావడం గమనార్హం. అంటే, హిందీ వెర్షన్ విషయంలో ‘కార్తికేయ-2’ అంచనాలకు మించి వసూళ్ళను రాబడుతోందనే కదా అర్థం.?

అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నిఖిల్ సిద్దార్ధ సరసన హీరోయిన్‌గా నటించింది. 20 కోట్ల క్లబ్బులోకి హిందీ వెర్షన్ ‘కార్తికేయ-2’ చేరడం అనేది ఇంకో రెండు మూడు రోజుల్లోనే జరగొచ్చు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us