Nikhil : చిన్న సినిమా రిలీజంటే హీరోలకి ఏడుపు తప్పదా?

NQ Staff - August 1, 2022 / 06:45 PM IST

Nikhil  : చిన్న సినిమా రిలీజంటే హీరోలకి ఏడుపు తప్పదా?

Nikhil  : సినిమా రాయడం, తీయడం అంతా ఒకెత్తు కష్టమయితే ఫైనల్ గా మూవీ రిలీజ్ చేయడానికి పడే కష్టం మరో ఎత్తు. భారీ బడ్జెట్‌ చిత్రాలు, బడా ప్రొడ్యూసర్ల ప్రాజెక్టులకు ఈ కష్టాలు పెద్దగా లేకపోయినా మీడియం, చిన్న సినిమాలు ఫేస్ చేయాల్సిందే. తాజాగా నిఖిల్‌ కూడా ఈ రిలీజ్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడట. చందు మొండేటి డైరెక్షన్లో నిఖిల్‌ హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ కార్తికేయ టూ. ఇప్పటికే ప్రామిసింగ్ ట్రైలర్ తో ఆడియెన్స్‌ అటెన్షన్ ను డ్రా చేసిన ఈ మూవీ ఆగస్ట్ పన్నెండున విడుదల కానుంది. సినిమా కంప్లీటై ముందు జూలై 22 రిలీజ్ డేట్ అనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ససేమిరా అన్నారట. కుదరదు వాయిదా వేసుకోండి, అక్టోబర్, నవంబర్ కి వెళ్లిపోండి ఇప్పుడు విడుదల చేస్తే థియేటర్స్‌ ఇవ్వం, షోలు పడవు అన్నారట. దాంతో నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఏడ్చా ఆ రోజు ఏడ్చా అంటూ ఓ ఇంటర్ వ్యూలో చెప్పుకొచ్చాడు నిఖిల్.

ఇలా తను ఇబ్బందులు ఎదుర్కోడానికి కూడా కారణం లేకపోలేదు. జూలై 22 న దిల్‌ రాజు ప్రొడక్షన్లో నాగచైతన్య హీరోగా వచ్చిన థ్యాంక్యూ మూవీ రిలీజయింది. మరోవైపు ఆగస్ట్ ఐదున కళ్యాణ్ రామ్ ‘బింబిసార‘, సీతారామం థియేటర్స్‌ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆగస్ట్ పన్నెండున నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కానుంది.

Nikhil is Troubled By Top Producers

Nikhil is Troubled By Top Producers

ఇలా బ్యాక్ సపోర్ట్ అండ్ ఇన్‌ ఫ్లూయెన్స్‌ ఉన్న సినిమాలు ఏ అడ్డంకులూ లేకుండా అనుకున్న డేట్ కే ఆడియెన్స్‌ ముందుకొస్తున్నాయి. రిజల్ట్ ఎలా ఉన్నా ఎక్కువ స్క్రీన్స్‌ లో రిలీజ్ చేసుకుని ఓపెనింగ్స్‌ మాత్రం బంపర్ గా రాబట్టుకుంటున్నాయి. మరి బ్యాక్ గ్రౌండ్ లేదనే నిఖిల్‌ ని ఇలా ఇబ్బంది పెట్టారా? తన సినిమాని వాయిదా వేసుకోమని చెప్పారా? అంటూ చాలా రకాల డిస్కషన్స్‌ మొదలై పోయాయిప్పుడు.

ఆ మాటకొస్తే నిఖిల్‌ మరీ

పేరు తెలీని హీరో అయితే కాదు. అన్నో ఇన్నో చెప్పుకోదగ్గ హిట్స్‌ ఉండి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టారే. పైగా కార్తికేయ టూ ఓ హిట్ మూవీకి సీక్వెల్. అలాంటి హీరోకి, సినిమాకే ఇన్ని తిప్పలొస్తే చిన్న సినిమాలు పరిస్థితేంటి?

నెలలు నెలలు కష్టపడి కథ రాసుకుని, డిఫరెంట్ లొకేషన్స్‌ లో షూట్ చేసి, మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ ప్లాన్ చేసుకుని, ఫైనల్ గా ఓ డేట్ అనుకుంటే, థియేటర్స్‌ ఇవ్వం, షోలు పడవు అన్న కామెంట్స్‌ ఫేస్ చేస్తే బాధగానే ఉంటుంది మరి. అఫ్ కోర్స్.. పెద్ద సినిమాలు బడా స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్ తో వస్తాయి కాబట్టి, ఎక్కువ స్క్రీన్స్‌ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తారు. ఓకే. కానీ ఇక బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అని.. మిగతా సినిమాలు కూడా పోటీలో ఉండకూడదు అంటే ఎలా? థియేటర్స్‌ ఇవ్వం అని డైరెక్ట్‌ గా డిస్కరేజ్ చేస్తే ఎలా? మూవీ తీశాక ఫైనల్ గా ఏదో ఓ సినిమాతో క్లాష్‌ అవ్వాల్సిందే. ఏదో ఫ్రైడే బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సిందే. ఆఖరికి ఆడియెన్స్‌ ఏది ఆదరిస్తే ఆ సినిమా సర్వైవ్ అవుతుంది. హిట్టయి కలెక్షన్స్‌ తో కాసుల వర్షం కురిపిస్తుంది.

Nikhil is Troubled By Top Producers

Nikhil is Troubled By Top Producers

గతంలోనూ చిన్న, మీడియమ్ సినిమాలకి ఈ రిలీజ్ కష్టాలు, థియేటర్స్‌ దొరక్కపోవడాలు అనే సమస్యలు టాలీవుడ్ లో చర్చకు దారితీశాయి. ఇక ప్యాండెమిక్ తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. థియేటర్స్‌ లో సినిమా మనుగడే ప్రశ్నార్థకంగా తయారయింది. ఇలాంటి టైమ్ లో కూడా ధైర్యం చేసి సినిమాలు తీసి, కథ మీదో, కంటెంట్ మీదో నమ్మకంతో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తే ఇదీ పరిస్థితి. ఇప్పటికే నిఖిల్ చేసిన కామెంట్స్‌ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి కార్తికేయ టూ సక్సెస్ తో తను ఫేస్ చేసిన రిలీజ్ ఇష్యూలకి కారణమైన వాళ్లకి సరైన సమాధానం చెప్తాడేమో తెలియాలంటే ఆగస్ట్ 12 వరకు వెయిట్ చేయాల్సిందే

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us