Nikhil : డైరెక్టర్ తో విభేదాలు.. కొట్టుకున్నాం.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..!
NQ Staff - June 23, 2023 / 01:32 PM IST

Nikhil : హీరో నిఖిల్ ఇప్పటి వరకు చేసిని సినిమాలు అన్నీ మంచి హిట్ అవుతున్నాయి. కాకపోతే అప్పుడప్పుడు ఆయన వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ స్పై సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని భగత్ సింగ్ మిస్టరీ చుట్టూ జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా వచ్చి బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా డైరెక్టర్ తో నిఖిల్ కు గొడవలు వస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ట్రైలర్ లాంచ్ తర్వాత ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నాకు డైరెక్టర్ తో గొడవలు వస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి నిజం లేదు. ఆయనతో నాకు మంచి సన్నిహిత్యం ఉంది.
ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో ముఖ్యంగా క్వాలిటీ ఉండాలని భావిస్తాను. అందుకే చాలా విషయాల్లో డైరెక్టర్లతో వాదిస్తూ ఉంటాను. ఎందుకంటే సినిమా క్వాలిటీగా ఉంటేనే ఔట్ పుట్ బాగా వస్తుంది. అప్పుడే ప్రేక్షకులు సినిమాను చూస్తారు అంటూ తెలిపాడు నిఖిల్.
విడుదల తేదీని వెనక్కు నెట్టాలని కోరడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఆ విషయంలో మేం ఇంకా చర్చలు సాగిస్తున్నాం అంటూ తెలిపాడు నిఖిల్. అంటే తన సినిమా క్వాలిటీ విషయంలో నిఖిల్ కాంప్రమైజ్ కాడని అంటున్నారు నెటిజన్లు.