Niharika : నిహారిక లిప్‌లాక్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
NQ Staff - May 19, 2022 / 10:51 AM IST

Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఇటీవల తెగ వార్తలలో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వలన నిహారిక పలు విమర్శలు ఎదుర్కొంది. ఇక పోలీసులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసి పార్టీ జరుగుతున్న పబ్‌పై దాడి చేశారు. అక్కడ నిహారిక కొణిదెల ఉండటం అనేది హాట్ టాపిక్‌గా మారింది. తర్వాత ఆమెను పోలీసులు వదిలేసినా నెటిజన్స్ మాత్రం ట్రోల్ చేయడం మానటం లేదు.
ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నిహారిక తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం జోర్దాన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించి కొన్ని ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది. ఇందులో ఓ ఫొటోకు నేను ఎక్కడున్నా స్వర్గాన్ని వెతుక్కుంటాను’ అంటూ క్యాప్షన్ జోడించింది. ఫొటోలను చూసి కొందరు మెచ్చుకుంటుంటే కొందరు మాత్రం తమదైన రీతిలో కామెంట్స్ రూపంలో రెచ్చిపోయారు.

Niharika Lip Lock Photo
రీ ఎంట్రీ తర్వాత నిహారిక షేర్ చేసిన ఈ లిప్ లాక్ ఫొటో మళ్లీ టాపిక్‌గా మారింది. ఎప్పటికీ విడిపోని బంధం అంటూ ఆమె సదరు ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీనిపై నెటిజన్స్ రియాక్షన్స్ ఒక్కోలా ఉంది. కొందరైతే చాలా ప్రశ్నలకు ఈ ఒక ఫొటోతో నిహారిక సమాధానం చెప్పిందని చెప్పగా.. కొందరు మాత్రం చిరంజీవిగారి పరువు తీయటానికి కాకపోతే ఇలాంటి ఫొటోలు ఎందుకు షేర్ చేయడం అని అంటున్నారు.

Niharika Lip Lock Photo
నిహారిక పర్టికులర్‌గా ఈ ఫొటో పెట్టడానికి కారణం మాత్రం భర్తతో నిహారిక రిలేషన్ గురించి సింపుల్‌గా ఒక ముక్కలో చెప్పాలనే ఉద్దేశమే అయ్యుంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఇక ఇప్పట్లో సినిమాల జోలికి వెళ్లేలా కనిపించడం లేదు.