Night Curfew : ఏపీ నైట్ క‌ర్ఫ్యూ వాయిదా.. సంతోషం వ్య‌క్తం చేస్తున్న ప్ర‌జ‌లు

Night Curfew : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో నైట్ కర్ఫ్యూ విధించాలని సోమవారం సీఎం జగన్ ఆదేశించగా తాజాగా కొత్త ప్ర‌క‌ట‌న చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. అంతకుముందు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరుకు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.

Night Curfew back in ap because Sankranthi
Night Curfew back in ap because Sankranthi

అయితే పండగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత నైట్‌ కర్ఫ్యూ అమలు కానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే కరోనా ఆంక్షలు కూడా రాష్ట్రంలో అమలులో ఉంటాయని తెలిపింది.

వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశాల్లో అయితే 200 మంది, ఇన్‌డోర్‌‌లలో అయితే 100 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం కెపాసిటీతోనే థియేటర్లను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకులకు మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం సూచించింది.

అయితే నిత్యావసర వస్తువులు, అత్యవసర చికిత్స వంటి సేవలకు కరోనా ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించిన సీఎం.. పలు కీలక ఆదేశాలను జారీ చేశారు.

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. ఈ మేరకు వైద్య నిపుణులను సంప్రదించి.. ఇవ్వాల్సిన మందులను కోవిడ్ హోం కిట్స్‌లో జత చేయాలని సూచించారు.