Nidhi Agarwal : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు స్టోరీ లీక్ చేసిన నిధి అగ‌ర్వాల్‌.. రెండు గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్న ప‌వ‌న్

Nidhi Agarwal : ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో లైమ్‌లైట్ లోకి వ‌చ్చిన నిధి అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మ‌డు తాజాగా హీరో అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది.

Nidhi Agarwal about Hari Hara Veeramallu movie
Nidhi Agarwal about Hari Hara Veeramallu movie

హీరో మూవీ ఇంట‌ర్వ్యూల‌లో భాగంగా ప‌వ‌న్ హీరోగా రూపొందుతున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా స్టోరీకి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు లీక్ చేసింది. ‘హరిహర వీరమల్లు’ రెండు టైం జోన్లలో నడిచే కథ అని, ఒకటి పురాతన కాలంలో మరొకటి ఈ కాలంలో నడుస్తుందని చెప్పుకొచ్చింది.

Nidhi Agarwal about Hari Hara Veeramallu movie
Nidhi Agarwal about Hari Hara Veeramallu movie

ఇప్పటివరకు ఈ సినిమా పూర్తిగా చారిత్రాత్మకంగా ఉండబోతుందని, పవన్ సినిమా మొత్తం వీరమల్లు లానే కనిపిస్తాడని అనుకున్నారు. కానీ, ఇప్పుడు నిధి చెప్పిన ప్రకారం పవన్ రెండు గెటప్పులో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు క్రిష్, చిత్ర యూనిట్ రివీల్ చేయని సీక్రెట్ ని నిధి లీక్ చేయడంపై అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

నిధి `పంచమి` పాత్రలో నటిస్తుంది. కెరీర్‌ బిగినింగ్‌లోనే పవన్‌తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది నిధి. ప్రస్తుతం ఇది యాభై శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని తెలిపింది. మిగ‌తా షూటింగ్ కూడా పూర్తి చేసేందుకు నిధి చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. ఈ చిత్రంలో ఇందులో తాను యాక్షన్‌ కూడా చేసిందట.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి పెద్ద స్టార్‌తో కలిసి నటించాలని, యాక్షన్‌ చిత్రాలు చేయాలనే కోరిక ఉందని, ఈ రెండు ఒకే సినిమాతో తీరడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది నిధి అగ‌ర్వాల్. నటిగా తనకు నెక్ట్స్ లెవల్‌ సినిమా అవుతుందని చెప్పింది. కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని చెప్పొంది.