Hero Sharwanand : మొదలైన శర్వానంద్ పెండ్లి వేడుకలు.. ఫొటోలు వైరల్..!
NQ Staff - June 3, 2023 / 01:02 PM IST

Hero Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెండ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఆయన గత జనవరి నెలలో రక్షిత రెడ్డితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తెలంగాణ హైకోర్టు లాయర్అయిన మధుసూదన్ రెడ్డి కుమార్తెనే ఈ రక్షిత రెడ్డి. ఆమె ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా జనవరిలో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత చాలా కాలంగా వీరిద్దరూ పెండ్లికి గ్యాప్ తీసుకున్నారు. ఇక తాజాగా పెండ్లి వేడుకలు షురూ చేశారు. నిన్న రాత్రి లీలా ప్యాలెస్ లో మెహందీ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో శర్వానంద్ చాలా సరదాగా కనిపించాడు. తనకు కాబోయే భార్యను ఆటపట్టిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెండ్లి అంటే జీవితంలో ఒకేసారి వస్తుంది కాబట్టే శర్వానంద్ ఇంత ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక లీలా ప్యాలెస్ లో ఒక రోజుకు రూ.4 కోట్లు తీసుకుంటున్నారంట. అంటే రెండు రోజుల వేడుకకు రూ.8 కోట్లు తీసుకునే ఛాన్స్ ఉంది.
జూన్ 3 అంటే ఈరోజు ఆయన పెండ్లి వేడుక జరిగే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో ఆ కార్యక్రమం మొదలు కానుంది. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారంట.