Divorce : ఇటీవల టాలీవుడ్ సెలబ్రిటీలు విడాకుల విషయంతో వార్తలలో నిలుస్తున్నారు. ఎప్పుడు ఏ సెలబ్రిటీ జంట విడాకుల వార్త చెబుతుంది అనే విషయం మీద ఎవరికీ అవగాహన ఉండటం లేదు. ఇప్పటికే తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. సమంత- నాగ చైతన్య విడాకుల తర్వాత దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్- శ్రీజ విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది.

విడాకుల రచ్చ..
ఇక కొద్ది రోజులుగా శ్రావణ భార్గవి- హేమ చంద్ర కూడా విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియడం లేదు. అయితే ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోలు తమ భార్యలకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నారట. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హట్ టాపిక్‌గా మారింది.
ఒక యంగ్ హీరో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకోగా, ఆయనకు భార్య నుంచి విడాకుల పిటిషన్ రానుందట. ఆమె ఆయన నుంచి ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసిందట. తను అనుకున్నట్టు ఆయన లేని కారణంగా విడాకులకి అప్లై చేసిందట. ఇటీవల ఆయన ఎక్కువగా అమ్మాయిలతో తిరుగుతున్నాడని అందుకే డైవర్స్‌కి అప్లై చేసిందని సమాచారం.

మరో హీరోకు కూడా రెండేళ్ల కిందటే పెళ్లయింది. ఈయన కూడా భార్యతో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈయన ఒక ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య విబేధాలు ఎందుకు వచ్చాయి, ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నారో తెలియడం లేదు.
మరో హీరోకి పెళ్లై ఒకరు సంతానం కాగా ఆయన కూడా విడాకులు తీసుకోవాలని చూస్తున్నారట. వీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో తెలియదు కానీ.. కుటుంబ సభ్యులు, స్నేహితులు సర్ది చెప్పారట. కనుక వీరు కొంత కాలం వరకు ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు యంగ్ హీరోలు వివాహ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.