Surekha Vani : నటి రజిత బర్త్‌డే పార్టీలో మరో నటి హేమ చేసిన హంగామా చూస్తే షాకవ్వాల్సిందే.!
NQ Staff - September 24, 2022 / 10:01 PM IST

Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత ఇంట్లో బర్త్‌డే పార్టీ జరిగింది. ఈ బర్త్‌డే పార్టీకి పలువురు నటీ నటులు హాజరయ్యారు. వారిలో నటుడు రాజా రవీంద్ర కూడా వున్నారు. సురేఖా వాణి, సన, హేమ.. తదితర తోటి నటీనటులతో నటి రజిత తెగ సందడిగా కనిపించారు.
కేక్ కటింగ్ సమయంలో సురేఖా వాణి, రాజా రవీంద్రతో మెడపై చేతులు వేసి, బోలెడంత సందడి చేసింది. ఇది చూసిన నెటిజన్లు సురేఖా వాణిని ట్రోల్ చేస్తుండగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
తోటి నటీనటుల హంగామా మధ్యన సాగిన ఈ బర్త్‌డే పార్టీ కాసేపటి తర్వాత ఇంట్లోకి షిఫ్ట్ అయ్యింది. ఇళ్లంతా సరదాగా తిరుగుతూ నటి హేమ లైవ్ వీడియోను ఫోన్‌లో చిత్రీకరించింది. ఈ వీడియోలో నటి సన, బర్త్‌డే ఆంటీ రజిత.. ఇలా పలువురు నటీమణులు కనిపించారు.
ఆంటీస్ ఆత్మీయ కలయిక
నీ కన్నా నేనే సన్నగా వున్నా.. అంటే లేదు నేను సన్నగా వున్నా.. అంటూ ఆంటీస్ సరదా సరదాగా ఫన్నీ చేసుకుంటున్నారు. రజితకు వచ్చిన అవార్డుల్ని ఈ వీడియోలో చూపించింది నటి హేమ. ఇక సినిమాల విషయానికి వస్తే, హేమ, సురేఖా వాణి, రజిత, సన.. తదితర ముద్దుగుమ్మలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొన్ని సినిమాల కోసం కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. కొన్ని సినిమాల్లో విడివిడిగానే నటించారు.
కానీ, షూటింగుల నుంచి అప్పుడప్పుడూ కాస్త సమయం దొరికితే, ఇదిగో ఇలా ఒక్క చోట చేరి హంగామా చేస్తుంటారు. తాజాగా రజిత బర్త్ డే పార్టీ వీరి ఆత్మీయ కలయికకు వేదికయ్యిందన్నమాట.