Prabhas : అన్నా శర్వానంద్ పెళ్లి కూడా ఫిక్స్ అయ్యింది… నీది ఎప్పుడు?
NQ Staff - January 26, 2023 / 07:00 PM IST

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం మళ్ళీ ఒక సారి సోషల్ మీడియాలో ప్రస్తావనకు వచ్చింది. నేడు హీరో శర్వానంద్ వివాహ నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్లో సినీ ప్రముఖులు హాజరైన ఈ వివాహ నిశ్చితార్థ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలు చూసిన చాలా మంది ప్రభాస్ అభిమానులు చివరకు శర్వానంద్ పెళ్లి కూడా అవుతుంది.. నీ పెళ్లి ఎప్పుడు ఉంటుంది అన్న అంటూ ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రభాస్ ని ప్రశ్నిస్తున్నారు.
ఆ మధ్య ప్రభాస్ పెళ్లి తర్వాత తన పెళ్లి ఉంటుంది అన్నట్లుగా శర్వానంద్ సరదాగా అన్ స్టాపబుల్ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ పెళ్లి చేసుకోకుండానే శర్వానంద్ పెళ్లి చేసుకుని ప్రభాస్ కి నమ్మక ద్రోహం చేస్తున్నాడు అంటూ కొందరు సరదాగా శర్వానంద్ పై కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి ఇంత మంది పెళ్లి పీఠలు ఎక్కినా కూడా ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ మరియు రాహుల్ గాంధీ మాదిరిగా ప్రభాస్ కూడా బ్యాచిలర్ గానే ఉండిపోతాడా ఏంటి అంటూ కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.