Manchu Lakshmi : మ‌రోసారి నెటిజ‌న్స్ ఆగ్రహానికి గురైన మంచు ల‌క్ష్మీ.. ఎందుకో తెలుసా?

Manchu Lakshmi : మంచు మోహ‌న్ బాబు న‌ట వార‌సత్వాన్ని పుణికి పుచ్చుకున్న మంచు ల‌క్ష్మీ కొన్ని సంవ‌త్స‌రాలుగా వైవిధ్య‌మైన పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌కి అల‌రిస్తూనే హోస్ట్‌గాను ప‌లు షోస్ చేస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మీ ఒక్కోసారి నెటిజ‌న్స్ ఆగ్ర‌హానికి గుర‌వుతూ ఉంటుంది. వారు ఎంత‌గా ట్రోల్ చేసిన కూడా మంచు ల‌క్ష్మీ త‌న‌దైన శైలిలో దూసుకుపోతుంది.

netizens fire on Manchu Lakshmi
netizens fire on Manchu Lakshmi

కొద్ది రోజుల క్రితం మంచు ల‌క్ష్మీ కరోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఆమె ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఇక ఐసోలేష‌న్‌లో తాను చేస్తున్న ప‌నుల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తుంది. అయితే గో కరోనా గో అని గట్టిగా అరిచినా కూడా అది తనను పట్టుకుందని కాస్త వెరైటీగా కరోనా సోకిన విషయాన్ని చెప్పిన మంచు లక్ష్మి.. తాజాగా తనకు కరోనా నెగెటివ్ అని చెప్పింది.

అందరికీ నమస్కారం. నాకు నెగెటివ్ వెచ్చేసింది అంటూ తెగ సంబరపడుతూ చెప్పిన మంచు లక్ష్మి.. తన కూతురు విద్య నిర్వాణకు లిప్ కిస్సులు ఇచ్చింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ విషయాన్ని బయటపెట్టింది. అయితే మంచు లక్ష్మికి కరోనా నెగెటివ్ రావడం సంతోషించదగిన విషయమే.

త‌నకు నెగెటివ్ వ‌చ్చింద‌న్న‌ ఆనందంలో ఆమె చేస్తున్న పనులు అంత మంచివి కావని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కరోనా నెగెటివ్ వచ్చినా కూడా ఇంకా కొన్ని రోజులు కేర్‌గా ఉండాల్సిన అవసరం ఉందని, చిన్న పిల్లతో అంత దగ్గరగా ఉంటూ ముద్దులు పెట్టడం సరికాదని అంటున్నారు నెటిజన్లు. ఇంకొందరు నెటిజన్లు అయితే మరో అడుగు ముందుకేసి మంచు లక్ష్మి ప్రవర్తనను ఏకిపారేస్తున్నారు.

ఏదేమైనా కరోనా విషయంలో కూడా మంచువారమ్మాయి ట్రోల్స్ బారిన పడటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. గ‌తంలో ఈ అమ్మ‌డు ప‌లు అంశాల‌పై అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ విమ‌ర్శ‌ల పాలైన విష‌యం తెలిసిందే.