Balakrishna : స్టేజిపై బూతులు మాట్లాడిన బాలయ్య.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు..!
NQ Staff - January 23, 2023 / 02:26 PM IST

Balakrishna : సెలబ్రిటీల హోదాలో ఉన్నప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఎక్కడ ఏం మాట్లాడినా సరే సోషల్ మీడియా వెతికి మరీ పట్టేస్తుంది. కాబట్టి స్టార్లు మాత్రం ఆలోచించి మాట్లాడాలి. కానీ ఈ నడుమ సెలబ్రిటీలు కూడా ఓపెన్ గానే బూతులు మాట్లాడుతున్నారు. ఎవరేం అనుకుంటారు అనేది అస్సలు ఆలోచించట్లేదు. ఇక తాజాగా బాలయ్య చేసిన కామెంట్లు కూడా ఇలాగే ఉన్నాయి.
ఆయన కూడా అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటాడు. అనవసరంగా ఏదో మాట్లాడాలి అనుకుని ఇంకేదో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆయన నోటివెంట అప్పుడప్పుడు బూతులు వస్తూ ఉంటాయి. ఇక తాజాగా ఆయన నటించిన వీర సింహారెడ్డి మూవీ మంచి హిట్ కొట్టింది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ఆ హీరో గురించి మాట్లాడుతూ..
ఈ ఈవెంట్ కు అనిల్ రావిపూడి, విశ్వక్ సేన్, సిద్దూ జొన్నల గడ్డ, హరీశ్ శంకర్ లు వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ముందుగా విశ్వక్ సేన్ గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత ఇక్కడ పలకరించే ముందు హిందీలోనే మాట్లాడుతారని చెప్పాడు. తాను కూడా నిజాం కాలేజీలో చదువుకున్నట్టు గుర్తు చేసుకున్నాడు.
ఈ సందర్భంగా పలకరించుకునేటప్పుడు ఇలాగే అంటారని కొన్ని బూతులు వదిలాడు. దాంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. స్టేజిపై అందరి ముందే ఇలా బూతులు మాట్లాడితే ఎలా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎంత పెద్ద హీరో అయితే మాత్రం ఇలా బూతులు మాట్లాడుతాడా అంటూ విమర్శిస్తున్నారు.