Thaman : పాటల్లో అప్పియరెన్స్ అదుర్సే.. మరి ట్యూన్స్ సంగతేటి థమనూ?

NQ Staff - November 26, 2022 / 12:38 PM IST

Thaman : పాటల్లో అప్పియరెన్స్ అదుర్సే.. మరి ట్యూన్స్ సంగతేటి థమనూ?

Thaman : ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఏ మాత్రం తడుముకోకుండా చెప్పే పేరు ఎస్ ఎస్ థమన్ అనే. సినిమా సక్సెసవడానికి తన మ్యూజిక్ ఎంత వరకు హెల్ప్ అవగలదో అంతకన్నా ఎక్కువే ఇవ్వడానికి ట్రై చేస్తుండడంతో బడా హీరోలకి, అగ్ర దర్శకులకి ఫేవరేట్ గా మారిపోయాడు థమన్. మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్, మణిశర్మ పాటల్లో ఆ మ్యాజిక్ తగ్గడంతో ఇండస్ట్రీలో సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నాడు.

మరోవైపు రికార్డింగ్ స్టూడియోల్లో ట్యూన్స్, కంపోజింగ్ మాత్రమే కాకుండా ప్రమోషనల్ సాంగ్స్, లిరికల్ సాంగ్స్ లోనూ హవా చూయిస్తున్నాడు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, కళావతి, సామజవరగమన.. ఇలా సాంగ్సులో కనిపిస్తూ కూడా తెగ సందడి చేస్తున్నాడు థమన్. ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ, ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లోనూ తనదైన స్టయిల్లో హడావిడి చేస్తుంటాడు కూడా.

కొన్నిసార్లు మూవీ మీద బజ్ పెరగడానికి, ఆడియెన్సులో హైప్ క్రియేటవడానికి కూడా తన టాలెంట్ బాగా యూజవుతుంది. అంతా బాగానే ఉంది కానీ.. లేటెస్టుగా రిలీజైన జై బాలయ్య పాటతో మరోసారి డిఫరెంట్ కామెంట్సుతో వార్తల్లో నిలస్తున్నాడు థమన్. బాలక్రిష్ణ హీరోగా వీరసింహా రెడ్డి అనే చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ వార్లో నిలవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఆ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం కూడా తెలిసిందే. బాలయ్య గత చిత్రం అఖండ అంతలా సక్సెసవడంలో థమన్ మ్యూజిక్, ఆర్ ఆర్ కూడా కీ రోల్ ప్లే చేసింది. దాంతో వీరసింహారెడ్డి సాంగ్స్ పై ఆటోమేటిక్ గా ఆడియెన్సులో హైప్ పెరిగింది. తీరా ఫస్ట్ సాంగ్ జై బాలయ్య రిలీజయ్యాక ఆ ట్యూన్స్ మీద రకరకాల పోస్టులు, ట్వీట్లు వైరలవుతున్నాయి.

ఈ పాట ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగులాగే ఉందంటూ ఎడిట్లు చేసి మీమ్స్ వేస్తున్నారు నెటిజన్స్. పైగా ఇందులో థమన్ చైన్లు, ఉంగరాలతో బంగారం దిగేసుకుని హీరోకి తీసిపోని తీరు బానే సందడి చేశాడు గానీ.. ఆ అప్పియరెన్స్ మీద పెట్టే కాంసంట్రేషన్ ట్యూన్ మీద కూడా పెడితే ఇంకా మంచి పాటలొస్తాయి కదా అంటూ కామెంట్ చేస్తున్నారు కొందరు ఆడియెన్స్. ఆల్బములో ఫస్ట్ పాటే ఇలా పాత పాటల్ని గుర్తు చేస్తోందంటే.. తర్వాతి పాటల పరిస్థితేంటో అంటూ పెదవి విరుస్తున్నారు ఇంకొందరు. ట్యూన్, సాంగ్, క్యాచీ హమ్మింగ్ బీట్.. ఇలా అన్నీ కుదిరితే బడా హీరోల ఫ్యాన్సు ఫీలయ్యే ఆనందం అంతా ఇంతా కాదు. కాలర్ ట్యూన్స్, రింగ్ టోన్సూ పెట్టేసుకుని తెగ ఓన్ చేసుకుంటారు.

ఎట్ ది సేమ్ టైమ్.. ఇలా ఏ మాత్రం తేడా కొట్టినా, ఎక్కడో విన్నట్టుందే అన్నట్టు అనిపించినా ఓ రేంజులో ఆడేసుకుంటారు. ప్రస్తుతం థమన్ కి ఈ పాట విషయంలో మిక్స్డ్ రియాక్షన్స్ అందుతున్నాయి పాపం. అయినా థమన్ మీద, ఆయన కంపోజ్ చేసిన పాటల మీద నెగిటివ్ కామెంట్స్ రావడం కొత్తేమీ కాదు.

కెరీర్ స్టార్టింగ్ నుంచే ఎస్ ఎస్ థమన్ అంటే సేమ్ టు సేమ్ థమన్ అంటూ ట్రోల్స్ కూడా పడ్డాయి. అయినా డీలా పడకుండా ట్యూన్సుల్లో కొత్తదనం చూయించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. మెల్ల మెల్లగా సూపర్ హిట్ సాంగ్స్, వైరల్ ట్యూన్స్, బ్లాక్ బస్టర్ ఆల్బమ్సుతో సౌత్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అలవైకుంఠపురంలో చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు.

సో.. థమన్ ట్యూన్స్ మీద ఫోకస్ పెడితే ఇంకా మంచి ఆల్బమ్స్ వచ్చే స్కోప్ ఉంది. అలానే ఈ ప్రమోషనల్ సాంగ్సు, లిరికల్ సాంగ్సుల్లో హడావిడి తగ్గించి ఈ ఇంట్రస్ట్ పాటల మీద పెడితే వేరే లెవల్లో అవుట్ పుట్ ఉంటుందని ప్రేమపూర్వకంగానే సజెషన్స్ ఇస్తున్నారు. మరి థమన్ ఇలాంటి కామెంట్సుకు తన ట్యూన్స్ తోనే సరైన ఆన్సర్ చెప్తాడా? అప్ కమింగ్ ఆల్బమ్స్ తో అదరగొట్టి అందరిచేతా శభాష్ అనిపించుకుంటాడా అనేది చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us