Nazriya Nazim: నజ్రియా పేరు చెబితేనే భయపడిపోతున్నారట.! ఎందుకంటే.!

NQ Staff - September 24, 2022 / 10:27 PM IST

Nazriya Nazim: నజ్రియా పేరు చెబితేనే భయపడిపోతున్నారట.! ఎందుకంటే.!

Nazriya Nazim: నజ్రియా నజీమ్.. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. నిజానికి, ఎప్పుడో తెలుగు తెరపై తెరంగేట్రం చేయాల్సి వుంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమాతోనే తెలుగు నేలపై అడుగు పెట్టాల్సింది. కానీ, ఆలస్యమయ్యింది.. చివరికి నాని సరసన ‘అంటే సుందరానికీ’ సినిమాలో నటించింది.

కానీ, ‘అంటే సుందరానికీ’ సినిమాకి నజ్రియా వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. సినిమా కంటే ఎక్కువగా నజ్రియాకి పబ్లిసిటీ చేశారు. ఆమె కూడా చాలా హంగామా చేసింది. కానీ, తుస్సుమంది.

బాబోయ్ నజ్రియా.. కానీ, ఎందుకు.?

నజ్రియా పేరు చెబితేనే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ‘బాబోయ్’ అనే మాట వినిపిస్తోంది. రెమ్యునరేషన్ సహా చాలా విషయాల్లో నజ్రియాని తట్టుకోవడం కష్టమేనట. అందుకే, ఆమెను పూర్తిగా సైడ్ చేసేశారు.

‘అంటే సుందరానికీ’ తర్వాత తెలుగులో అవకాశాల కోసం నజ్రియా ప్రయత్నాలు చేస్తున్నా, ఏదీ వర్కవుట్ అవడంలేదు. రెమ్యునరేషన్‌తోపాటు, ఇతరత్రా వ్యవహారాల విషయంలోనూ నజ్రియా తగ్గాల్సిందే. కానీ, తగ్గనంటోందిట.

భర్త ఫహాద్ ఫాజిల్‌కి తెలుగులో వున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటోందిట నజ్రియా. ఫహాద్ పేరు చెప్పి అవకాశాల వేటలో పడ్డ నజ్రియాకి ఆ ప్రయత్నాలేవీ సఫలం కావడంలేదట. ‘అంటే సుందరానికీ’ ఎఫెక్ట్ అలాంటిది మరి.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us