Nayanthara Vignesh Sivan : అడ్డంగా బుక్కైన నయనతార, విఘ్నేష్.! ఎలా పిల్లలు పుట్టారో చెప్పాలన్న తమిళనాడు ప్రభుత్వం.!
NQ Staff - October 10, 2022 / 06:08 PM IST

Nayanthara Vignesh Sivan : సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అడ్డంగా బుక్కయ్యారు. తాము తల్లిదండ్రులమయ్యామంటూ నయనతార, విఘ్నేష్ శివన్ తాజాగా వెల్లడించిన విషయం విదితమే. వీరికి నాలుగు నెలల క్రితమే పెళ్ళయ్యింది. ఇంతలోనే ఈ ఇద్దరికీ పిల్లలు పుట్టారు.. అదీ కవలలు.. అందునా, మగ పిల్లలు పుట్టారు.
పిల్లలతో వున్న ఫొటోల్ని విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ దంపతులకు వారి అభిమానుల నుంచి విషెస్ అందుతున్నాయి పెద్దయెత్తున. ఇంతలోనే, తమిళనాడు ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.!
పిల్లలు ఎలా పుట్టారబ్బా.?
నయనతార ఎప్పుడు గర్భం ధరించింది.? అన్నది ఎవరికీ తెలియదు. నిజానికి, నయనతార గర్భం దాల్చలేదు. గర్భాన్ని అద్దెకు తెచ్చుకుంది. అద్దె గర్భం ద్వారా నయనతార, ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. కానీ, భారతదేశంలో 2022 జనవరి నుంచి అద్దె గర్భాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం, నయనతార – విఘ్నేష్ శివన్లకు ‘పిల్లలు ఎలా పుట్టారు.?’ అంటూ ప్రశ్న సంధించింది. నయనతార, విగ్నేష్ శివన్ ఈ విషయమై స్పందించాల్సిందే. వారికి వేరే ఆప్షన్ లేదు. అయితే, విదేశాల్లో గనుక ఈ జంట అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అయి వుంటే, పెద్దగా సమస్య వుండక పోవచ్చు.
మెజార్టీ సెలబ్రిటీలు, విదేశాల్లోనే అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులవుతుంటారు.