Nayanthara : నయన్‌ – విఘ్నేష్‌ : ఇన్నాళ్లు పెళ్లి గురించి ఇప్పుడు ఆ పుకార్లు మొదలా?

NQ Staff - September 27, 2022 / 05:26 PM IST

Nayanthara : నయన్‌ – విఘ్నేష్‌ : ఇన్నాళ్లు పెళ్లి గురించి ఇప్పుడు ఆ పుకార్లు మొదలా?

Nayanthara  : లేడీస్ సూపర్ స్టార్ నయన తార మరియు విగ్నేష్ శివన్ యొక్క పెళ్లి గురించి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మూడు నాలుగు సంవత్సరాల పాటు వీరి యొక్క పెళ్లి ప్రేమ గురించి వందల కొద్దీ వార్తలు పుకార్లు మీడియాలో వచ్చాయి, చూసాం.

ఇటీవల పెళ్లి జరిగింది..

పెళ్లి తర్వాత అయినా వీరి యొక్క హడావుడి మీడియాలో తగ్గుతుందేమో అనుకుంటే తగ్గనే లేదు. పెళ్లి అలా జరిగింది.. ఇలా జరిగింది అంటూ నిన్న మొన్నటి వరకు తెగ ప్రచారం జరిగింది.

పెళ్లి తర్వాత మంగళ సూత్రం ధరించి నయనతార మంగళప్రదంగా కనిపించడంతో అప్పుడు కూడా వీరి గురించి మీడియాలో చర్చ జరిగింది. ఇక ఇప్పుడు నయనతార తల్లి కాబోతుంది అనే కొత్త ప్రచారం మొదలైంది.

ఇన్నాళ్లు ప్రేమ పెళ్లి అంటూ ప్రచారం చేసిన తమిళ మీడియా ఇప్పుడు నయనతార తల్లి కాబోతుంది అంటూ కథనాలు ప్రచురితం చేస్తోంది. ఈ కథనాల్లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

ఇక నయనతార ప్రస్తుతం తమిళం మరియు తెలుగులో కలిపి వరుసగా సినిమాల్లో నటిస్తుంది, ఇదే సమయంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న అట్లీ సినిమా జవాన్ లో కూడా నయనతార కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇంత బిజీగా ఉన్న నయనతార ఇప్పట్లో తల్లి అయ్యేందుకు ఆసక్తి చూపిస్తుందా అంటే అనుమానమే. అందుకే ఈ వార్త నమ్మడానికి కాస్త ఇబ్బందిగానే ఉంది. తమిళ మీడియాలో వస్తున్న నయనతార తల్లి కాబోతుంది వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే మరికొన్ని వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us