Nayanthara And Vignesh Shivan : బుర్జ్ ఖలీఫా దగ్గర భర్త పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసిన నయనతార.!

NQ Staff - September 18, 2022 / 07:25 PM IST

Nayanthara And Vignesh Shivan : బుర్జ్ ఖలీఫా దగ్గర భర్త పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసిన నయనతార.!

Nayanthara And Vignesh Shivan : పెళ్ళి కాకుండానే చాలాకాలం కలిసి వున్నారు నయనతార, విఘ్నేష్ శివన్. పెళ్ళయ్యాక.. ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తూనే వున్నారు. నయనతార, విఘ్నేష్.. విదేశాల్లో పార్టీలు చేసుకోవడం కొత్తేమీ కాదు. పెళ్ళికి ముందూ చేసుకున్నారు. అప్పట్లో ప్రేమికులుగా.. ఇప్పుడు భార్యా భర్తలుగా వేడుకలు చేసుకుంటున్నారంతే.

తాజాగా నయనతార, విఘ్నేష్ శివన్ దుబాయ్‌లో సందడి చేశారు. దుబాయ్‌లో ప్రముఖ సందర్శనీయ స్థలం, వ్యాపార కేంద్రం అయిన బుర్జ్ ఖలీఫా వద్ద నయనతార, తన భర్త విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకల్ని అంగరంగ వైభవంగా జరిపింది.

భార్య ఇచ్చిన పార్టీ.. భర్త ఫుల్ హ్యాపీ..

Nayanthara Celebrated Husband Vignesh Shivan Birthday At Burj Khalifa

Nayanthara Celebrated Husband Vignesh Shivan Birthday At Burj Khalifa

తన భార్య తనకు సర్‌ప్రైజింగ్ పార్టీ ఇచ్చిందనీ, బోల్డంత ప్రేమ పంచిందనీ, ఈ పుట్టినరోజు చాలా చాలా ప్రత్యేకమైనదని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా విఘ్నేష్ శివన్ పలు ఫొటోల్ని షేర్ చేశాడు.

అన్నట్టు, నయనతార – విఘ్నేష్ శివన్ ఇటీవల అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుక ద్వారా ఒక్కటైన విషయం విదితమే. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థకి విక్రయించేశారు.

వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల నేపథ్యంలో పెళ్ళి ఖర్చు, హనీమూన్ ఖర్చులు.. ఆయా సంస్థలే స్పాన్సర్ చేస్తుండడం గమనార్హం.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us