Nayantara Vignesh Shivan : నయనతార సరోగసీ వివాదంలో కొత్త ట్విస్ట్: ఆరేళ్ళ క్రితమే విఘ్నేష్ శివన్ పెళ్ళి.!

NQ Staff - October 17, 2022 / 10:16 AM IST

Nayantara Vignesh Shivan : నయనతార సరోగసీ వివాదంలో కొత్త ట్విస్ట్: ఆరేళ్ళ క్రితమే విఘ్నేష్ శివన్ పెళ్ళి.!

Nayantara Vignesh Shivan : ప్రముఖ తమిళ సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నాలుగైదు నెలల క్రితమే నటి నయనతారకు పెళ్ళయ్యింది. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతిలో పెళ్ళి చేసుకోవాలనుకున్నారుగానీ, కుదరలేదు. పెళ్ళికి ముందు, పెళ్ళయ్యాక కూడా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది నయనతార – విఘ్నేష్ శివన్ జంట.

ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. నిజానికి, నయనతార – విఘ్నేష్ శివన్‌ల పెళ్ళి ఆరేళ్ళ క్రితమే జరిగిందట. ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట. ఈ విషయం తాజాగా బయటకు పొక్కింది.

సరోగసీ వ్యవహారంతో అసలు వాస్తవం వెలుగులోకి..

ఇటీవల నయనతార – విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులయ్యారు. వీరికి కవలలు జన్మించారు.. అదీ సరోగసీ విధానంలో. దాంతో, సరోగసీ చట్టాన్ని తెరపైకి తెచ్చారు కొందరు. ఐదు నెలల క్రితం పెళ్ళయితే, సరోగసీ మార్గంలో ఎలా తల్లిదండ్రులయ్యారు.? అన్న ప్రశ్న తెరపై కొచ్చింది.

దాంతో, తమిళనాడు ప్రభుత్వం, ఈ విషయం లో నిజాలు నిగ్గు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందట. ఆ కమిటీ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆరు నెలల క్రితమే తమకు రిజిస్టర్డ్ మ్యారేజ్ జరిగిందనీ, గత డిసెంబర్‌లో సరోగసీ కోసం దరఖాస్తు చేసుకున్నామని నయనతార దంపతులు ఈ కమిటీకి చెప్పారట.

పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నమాట.! ఇక్కడితో ఆగుతుందా.? ఇంకోసారి ఈ జంట పెళ్ళి చేసుకుంటుందా.? అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us