Nayanathara : థాయిలాండ్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్.!

NQ Staff - June 20, 2022 / 10:07 PM IST

Nayanathara : థాయిలాండ్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్.!

Nayanathara : చాన్నాళ్ళ సహజీవనానికి ముగింపు పలుకుతూ, వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్‌కి వెళ్ళారు తాజాగా. విదేశీ విహారం ఈ జంటకు కొత్తేమీ కాకపోయినా, నవ దంపతులుగా ఇదే వారికి తొలి విదేశీ విహారం. హనీ మూన్ కోసం నయనతార, విఘ్నేష్ శివన్ ఎక్కడికి వెళతారు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఈ జంట థాయిలాండ్‌లో తేలింది.

Nayanathara and Vignesh Shivan honeymoon photos

Nayanathara and Vignesh Shivan honeymoon photos

థాయిలాండ్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్ మూమెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్.! ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ఈ జంట మైమర్చిపోతోంది.

కొత్త కొత్తగా వున్నదీ.!

నిజానికి, గతంలోనే ఈ జంట విదేశీ విహారాల్లో హద్దులు దాటేసి.. తమ ప్రేమను చాటుకున్న సంగతి తెలిసిందే. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ లేదంటూ నెటిజనం కామెంట్లు వేస్తోంటే, చూడచక్కని జంట.. అంటూ నయనతార అభిమానులు స్పందిస్తున్నారు.

హనీమూన్ తర్వాత విఘ్నేష్ శివన్, నయనతార తమ తమ సినిమాల్లో బిజీ కానున్నారు. అజిత్ కుమార్ హీరోగా నటించే సినిమాకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనుండగా, నయనతార చేతిలో దాదాపు డజనుకి పైగా సినిమాలున్నాయ్.

ఇదిలా వుంటే, ప్రభుదేవాతో అంతకు ముందు శింబుతో నయనతార రొమాంటిక్ ఫొటోల్ని కొందరు నెటిజన్లు పోస్ట్ చేస్తూ, నయనతారని ర్యాగింగ్ చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us