Naresh : నరేష్ మూడు దుకాణాలు ఎక్కడెక్కడ తెరిచి మూసేశాడో తెలుసా..?
NQ Staff - July 4, 2022 / 01:41 PM IST

Naresh : ఒకప్పుడు టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో నవ్వించిన నటుడు నరేష్. ఆయన సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉండేది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అయితే నరేష్‌కి వివాదాలు కొత్తేమి కాదు. మొన్నటి వరకు మా ఎన్నికల సందర్భంగా పలువురి మీద అవాకులు చెవాకులు పేల్చిన నరేష్ ఇప్పుడు పవిత్రతో తెగ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో హాట్ టాపిక్ అయ్యాడు.

Naresh Three Marriages Fail
ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు పెటాకులు
కావడంతో ఆయన నటి పవిత్రతో కలిసి సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై ఇప్పటికే వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఇలా నాలుగో పెళ్ళికి సిద్ధమవుతున్నారని తెలియగానే మూడు పెళ్లిళ్లు ఎందుకు పేటాకులయ్యాయనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆరాతీస్తున్నారు.

Naresh Three Marriages Fail
నరేష్ మొదటిసారిగా సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులిద్దరికీ నవీన్ విజయ్‌కృష్ణ కొడుకు ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు కాగానే వెంటనే రెండవ వివాహం చేసుకున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి మనువరాలు సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కుమారుడు ఉన్నాడు. అయితే వీరు కూడా విడిపోయినా ఓ ఎన్జీవో కోసం మాత్రం కలిసి పని చేస్తున్నారు.
అయితే ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె రమ్య రఘుపతిని మూడవ వివాహం చేసుకున్నారు. ఆమె వయస్సు అప్పటికీ 30 ఏళ్ల లోపే. వీరి మధ్య 20 ఏళ్లకు పైగా ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా పెళ్లి చేసుకున్నారు. వీరికి కూడా ఓ కుమారుడు.

Naresh Three Marriages Fail
అయితే వీరిద్దరి మధ్య గొడవల కారణంగా ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. అయితే ఇప్పటికే వీరిద్దరు విడాకులు తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. నరేష్ మూడో భార్య కూడా అప్పట్లో చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదురుకుని వార్తల్లోకి ఎక్కింది. నరేష్ మూడో భార్య పేరు రమ్య రఘుపతి…ఆమె నరేష్, విజయనిర్మల పేరు చెప్పికొంతమంది వద్ద డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్ లో కేసులు కూడా బుక్ అయ్యాయి.
ఆమె ప్రవర్తన వల్లే విడిపోవాల్సి వచ్చిందని , డ్రైవర్‌తో ఎఫైర్ కూడా పెట్టుకుందని నరేష్ ఓపెన్ కామెంట్స్ చేశాడు.ఇప్పుడు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్‌తోనే కలిసి ఉంటున్నాడు. వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అటు పవిత్రా లోకేష్‌కు కూడా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తన భర్త సుచేంద్ర ప్రసాద్‌తో విడాకుల తర్వాత నరేష్ – పవిత్ర పెళ్లిజరిగే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.

Naresh Three Marriages Fail
మొత్తంగా నరేష్ మూడు పెళ్లిళ్లు విజయవంతం కాకపోవడానికి గల కారణం సినిమాలేనని అంటున్నారు .సినిమాలపై ఆసక్తితో ఈయన ఎక్కువగా సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం, దాంతో వారి పెళ్లాలతో నరేష్‌కి మనస్పర్ధలు రావడం జరిగిందని, అందుకే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవల్సి వచ్చిందని అంటున్నారు.
నరేష్ సూపర్‌స్టార్ కృష్ణ – విజయనిర్మల దంపతుల కుమారుడు. అంటే విజయనిర్మల కృష్ణకు రెండో భార్య కాగా.. నరేష్ విజయనిర్మలకు మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం. అయితే కృష్ణను పెళ్లి చేసుకున్నాక.. కృష్ణ నరేష్‌ను తన కుమారుడిలాగానే చూసుకున్నారు. నరేష్ 1972లో బాలనటుడిగా పండంటికాపురం సినిమాతో తొలిసారిగా వెండితెరపై కనపించాడు. ఆ తర్వాత తన తల్లి విజయనిర్మల దర్శకత్వంలో 1982లో వచ్చిన ప్రేమసంకెళ్లు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.