Narappa Movie : ‘నారప్ప’ కోసం థియేటర్లకు జనం వెళతారా.?
NQ Staff - December 9, 2022 / 01:07 PM IST

Narappa Movie : ఏం, ఎందుకు వెళ్ళరు.? స్పెషల్ షోస్ పేరుతో తమ అభిమాన హీరోల సినిమాల్ని ఆయా హీరోల పుట్టినరోజులు, ఇతర స్పెషల్ డేస్ సందర్భంగా ప్రదర్శిస్తోంటే చూస్తున్నారు కదా.? అలాగే, ‘నారస్ప’ సినిమాకి కూడా థియేటర్లకు అభిమానులు పోటెత్తే అవకాశం లేకపోలేదు.
విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘నారప్ప’ కోవిడ్ పాండమిక్ సమయంలో విడుదలయ్యింది. అది కూడా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. దాంతో, థియేటర్లలో ఈ సినిమాని చూడాలనుకునేవారికి కొంత నిరాశ ఎదురయ్యింది.
నారప్ప.. వెండితెరపై చూడాల్సిందేనప్పా..
ఓటీటీలో అందుబాటులో వున్నాగానీ, విక్టరీ వెంకటేష్ నట విశ్వరూపం చూడాలంటే సినిమాని వెండితెరపై చూడాల్సిందే. వెంకటేష్ మాత్రమే కాదు, ఈ సినిమాలో ప్రియమణి కూడా చెలరేగి పోయింది నటన పరంగా.
తమిళంలో ధనుష్ చేసిన సినిమా.. తెలుగులో వెంకటేష్ చేయడమేంటి.? అని తొలుత అంతా అనుకున్నారుగానీ, నారప్ప పాత్రలో వెంకటేష్ ఒదిగిపోయిన తీరుకి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.. అదీ ఒక్కరోజు మాత్రమే థియేటర్లలో వుంటుంది. అదే రోజు సినిమాని ఓటీటీలో చూసేస్తామంటారా.? అది వేరే విషయం.