Nara Chandrababu Naidu And Chiranjeevi : తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిరంజీవి: నారా చంద్రబాబు నాయుడు

NQ Staff - November 21, 2022 / 05:50 PM IST

Nara Chandrababu Naidu And Chiranjeevi : తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిరంజీవి: నారా చంద్రబాబు నాయుడు

Nara Chandrababu Naidu And Chiranjeevi  : ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారం మెగాస్టార్ చిరంజీవిని వరించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఈ పురస్కారం చిరంజీవికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి, అ పురస్కారానికి అన్నివిధాలా అర్హుడు. అంతే కాదు, ఆ పురస్కారానికి గౌరవం మరింత పెరిగినట్లయ్యింది కూడా.!

చంద్రబాబు ప్రశంసలు..

‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుతో అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్న సినీ అభిమానుల చిరంజీవికిగారికి శుభాకాంక్షలు. ఇది తెలుగు సినీ పరిశ్రమకే కాదు, తెలుగువారందరికీ గర్వకారణం’ అంటూ ట్వీటేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.

అంతే కాదు, ‘స్వయంకృషితో ఎదిగి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటులు చిరంజీవిగారికి అభినందనలు’ అని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.

అయితే, టీడీపీ అభిమానులు కొందరు మాత్రం చంద్రబాబు ట్వీటుని జీర్ణించుకోలేక పోతున్నారు.. రాజకీయ కారణాలతో.!

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us