Nandini Rai : నందినీ రాయ్.. యూ ట్యూబ్ సెన్సేషన్ అయిన ఈ ముద్దుగుమ్మకు బుల్లితెరపైనా బోలెడంత క్రేజ్ వుంది. అందుకు కారణం బుల్లితెరపై బిగ్‌బాస్ షో సీజన్‌లో నందినీ రాయ్ కూడా ఓ కంటెస్టెంట్‌గా వుండడమే. బిగ్‌బాస్‌లో తనదైన ఆటిట్యూడ్‌తో కొన్ని వారాలు సర్వైవ్ అయిన నందినీ రాయ్ ఓ మోస్తరు క్రేజ్ మూట కట్టుకుని బయటికి వచ్చేసింది.
అంతకు ముందు వరకూ చిన్నా చితకా పాత్రలతోనే సినిమాల్లో సరిపెట్టుకున్న నందినీ రాయ్, బిగ్ బాస్ షో తర్వాత హీరోయిన్‌గానూ కొన్ని సినిమాల్లో నటించింది. సునీల్, అల్లరి నరేష్ కాంబినేషన్లో రూపొందిన ‘సిల్లీ ఫెలోస్’ మూవీలో సునీల్ సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించింది నందినీ రాయ్.

ఓటీటీలో నందినీ రాయ్ నట విశ్వరూపం
ఓటీటీలో నందినీ రాయ్ పలు వెబ్ సిరీస్‌లలో నటించింది. గట్టిగా చెప్పాలంటే, ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైన నందినీ రాయ్‌కి ఛాలెంజింగ్ రోల్స్ దక్కాయని చెప్పొచ్చు. తాజాగా రాధికా శరత్ కుమార్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘గాలివాన’ వెబ్ సిరీస్‌లో నందినీ రాయ్ పోషించిన పోలీసాఫీసర్ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

నటి కాకముందే, నందినీ రాయ్‌కి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే అందాల పోటీల్లోనూ పాల్గొంది. మిస్ ఆంధ్ర ప్రదేశ్ కిరీటం కూడా దక్కించుకుంది. ఇక, సోషల్ మీడియా విషయానికి వస్తే, ఇక్కడా నందినీ రాయ్ తక్కువేం కాదు. లక్షల్లో ఫాలోవర్లున్నారు నందినీ రాయ్‌కి.
ఆ ఫాలోవర్స్‌ని యాక్టివ్‌గా వుంచేందుకు అప్పుడప్పుడూ స్పైసీ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది.
- Advertisement -

తాజాగా జలపాతం బ్యాక్ గ్రౌండ్‌లో నందినీ రాయ్ చేయించుకున్న ఫోటో షూట్ వావ్.! అనిపిస్తోంది. వెనుక భారీ జలపాతం. ముందు నందినీ రాయ్ భారీ అందాలారబోత.. రెండూ చూపు తిప్పుకోనీయవే. ఎటు మీ చూపుల బాణాలు సంధించాలనేది మీ ఇష్టమే. లెట్స్ లుక్ ఎట్ దిస్.
