Nandamuri Tarakaratna : తారకరత్న భార్యకు తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదా.. ఆమె పేరు మీదే ఉందా..?

NQ Staff - February 23, 2023 / 09:52 AM IST

Nandamuri Tarakaratna : తారకరత్న భార్యకు తండ్రి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదా.. ఆమె పేరు మీదే ఉందా..?

Nandamuri Tarakaratna : తారకరత్నకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా ఏ రేంజ్‌ లో వైరల్‌ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం అందరినీ కలిచి వేస్తోంది. యువగళం పాదయాత్రలో గుండెపోటుతో కింద పడిపోయిన ఆయనను కుప్పంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ చివరకు తుదిశ్వాస విడిచాడు. అయితే తారకరత్న మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన అనేక విషయాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

లవ్‌ మ్యారేజ్‌ కారణంగా..

తారకరత్న తండ్రి మోహనకృష్ణకు ఇద్దరు పిల్లలు. ఒకరు తారకరత్న, ఇంకొకరు కూతురు రూప. మోహన కృష్ణ గతంలో సినిమాటోగ్రాఫర్‌ గా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సీనియర్ ఎన్టీఆర్‌ నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. అయితే తారకరత్న లవ్‌ మ్యారేజ్‌ చేసుకోవడం కారణంగా ఇంట్లో వారికి దూరం అయ్యాడు.

ఇంట్లో వారు ఆయన్ను అప్పటి నుంచి దూరం పెట్టేశారు. తన మాట కాదని ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా.. తన ఆస్తి మొత్తం తన కూతురు రూపకే ఇచ్చాస్తానని అప్పుడే చెప్పేశారంట మోహనకృష్ణ. ఈ మేరకు ఇప్పటికే ఆస్తిపాస్తులు మొత్తం కూతురు రూప పేరు మీదనే రాసేశాడంట. మరి అలేఖ్యరెడ్డి పరిస్థితి ఏంటి అంటూ అందరూ కామెంట్లు చేసత్ఉన్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us