Bimbisara : ‘బింబిసార’ సినిమాని ఏకంగా ‘బాహుబలి’తో పోల్చుతున్నారు నందమూరి అభిమానులు. ‘అఖండ’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నందమూరి కుటుంబం నుంచి వచ్చిన సెన్సేషనల్ మూవీ ‘బింబిసార’ అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు.

థియేటర్ల నిండా నందమూరి అభిమానుల హంగామానే కనిపిస్తోంది. నందమూరి అభిమానుల నుంచి వస్తోన్న ఫీడ్‌బ్యాక్‌తో ‘బింబిసార’ హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్ ఫుల్ ఖుషీగా వున్నాడు.
సక్సెస్ సంబరాలు షురూ..
సినిమా ఘనవిజయం సాధించిందంటూ సంబరాలు చేసుకుంది ‘బింబిసార’ యూనిట్. మీడియా ముందుకొచ్చిన ‘బింబిసార’ చిత్ర బృందం, సినిమాకి అపూర్వ ఆదరణ లభిస్తోందని చెప్పింది. నిర్మాత, నటుడు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, ‘బింబిసార’ విజయం తమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనీ, ఇంతకు మించి ‘బింబిసార-2’ వుండబోతోందని చెప్పాడు.
త్వరలోనే ‘బింబిసార 2’ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది వెల్లడిస్తామన్న కళ్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ట.. చెప్పినదానికన్నా బాగా సినిమా తీశాడని, సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారని అన్నాడు.