Bimbisara : బింబిసార మాస్ సునామి.. లాభాల‌లో కళ్యాణ్ రామ్ చిత్రం

NQ Staff - August 8, 2022 / 11:33 AM IST

Bimbisara : బింబిసార మాస్ సునామి.. లాభాల‌లో కళ్యాణ్ రామ్ చిత్రం

Bimbisara : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మంచి హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా క‌ళ్లల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూడ‌గా, ఎట్ట‌కేల‌కు బింబిసార రూపంలో మంచి హిట్ ద‌క్కింది. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు దాదాపు 7 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. మొదటి, రెండో రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ఈ సినిమా మూడో రోజు కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Nandamuri Kalyan Ram Bimbisara Movie collections

Nandamuri Kalyan Ram Bimbisara Movie collections

బింబిసార హ‌వా..

మూడో రోజు ఈ చిత్రం 15.68 కోట్ల రూపాయ‌ల షేర్ రాబ‌ట్టింది. నైజాంలో 5.70 కోట్లు, సీడెడ్‌లో 3.30 కోట్లు, యూఏ- 2.29 కోట్లు, ఈస్ట్ 1.02 కోట్లు, వెస్ట్ 73 ల‌క్ష‌లు, గుంటూరు- 1.26 కోట్లు, కృష్ణ‌- 88 ల‌క్ష‌లు, నెల్లూరు 50 ల‌క్ష‌లు వ‌సూళ్లు రాబ‌ట్టింది. మొత్తానికి ఈ చిత్రం మూడో రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లే రాబ‌ట్టింది. దీంతో డిస్ట్రిబ్యూట‌ర్స్, బ‌య‌ర్స్ అంద‌రు లాభాలు ఆర్జిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలో బింబిసార క్లీన్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది

బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 15.6 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఈ సినిమా 16.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించగా, మూడు రోజుల‌కే టార్గెట్ ని రీచ్ అయింది. వ‌రల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 18.5 కోట్ల షేర్ రాబ‌ట్టింది. బింబిసార చిత్రానికి ఓవర్సీస్‌లో అంటే.. ముఖ్యంగా అమెరికాలో భారీ వసూళ్లను సాధిస్తున్నది.

ఈ సినిమాకు రెండో రోజున, మూడో రోజున‌ భారీగా కలెక్షన్ల గ్రాఫ్ పెరిగింది. మొదటి రోజు కంటే ఈ చిత్రం రెండో రోజున 50 శాతం వసూళ్లను పెంచుకొన్నది. ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇటీవల కాలంలో ఏ సినిమా సాధించిన కలెక్షన్లను నమోదు చేస్తున్నది. చూస్తుంటే ఈ చిత్రం ప‌లు రికార్డుల‌ని చెరిపేసేలా క‌నిపిస్తుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us