Junior NTR : ఇలాంటి అవమానాలు నాకు కొత్తేమీ కాదు.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..
NQ Staff - March 7, 2023 / 07:22 PM IST

Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ హీరోగా మారి పాన్ ఇండియన్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సొంత వాళ్ళతోనే ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాడు..
నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ ఎన్టీఆర్ కు వారి కుటుంబం నుండి ఏ మాత్రం సపోర్ట్ చేయలేదు.. ఈయన తన కెరీర్ లో సొంతంగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు.. అయితే అలాంటి హీరో అభిమానులు ఈ మధ్యకాలంలో తారకరత్న చనిపోయినప్పుడు బాలకృష్ణ చేసిన పని చూసి చాలా నిరాశ చెందుతున్నారు..
తారక్ ఫ్యాన్స్ మా హీరోను అవమానిస్తారా అంటూ బాధ పడుతున్నారు.. పెద్ద కర్మ రోజు ఎన్టీఆర్ వస్తే కనీసం పలకరించలేదు.. అంతేకాదు బాలకృష్ణ అటుగా వచ్చినప్పుడు ఎన్టీఆర్ గౌరవంతో లేచి నిలబడితే కనీసం మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడారు.. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలా మంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారు అంటూ బాధ పడుతున్నారు..
అయితే ఈ విషయాలను ఎన్టీఆర్ తన పిఆర్ టీమ్ ద్వారా తెలుసుకుని ఇలాంటి అవమానాలు నాకు కొత్తేమీ కాదని టైం వచ్చినప్పుడు అందరి ప్రశ్నలకు సమాధానం అదే దొరుకుతుంది అని ఎమోషనల్ అయినట్టు టాక్.. మరి ఈ విషయంలో నిజమెంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. గతంలో ఈయనను దూరం పెట్టిన వారే ఈయన స్టార్ హీరో అయ్యాక ఆయన దగ్గరికి వచ్చారు. అలానే త్వరలో మిగతా వారు కూడా వచ్చే సమయం వస్తుంది అని ఫ్యాన్స్ అంటున్నారు.