Veerasimha Reddy : నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ : సంక్రాంతి విడుదల.! డేట్ చెప్పలేదేం.?

NQ Staff - October 21, 2022 / 09:26 PM IST

Veerasimha Reddy : నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ : సంక్రాంతి విడుదల.! డేట్ చెప్పలేదేం.?

Veerasimha Reddy : నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం టైటిల్ ఖరారయ్యింది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు మీద టైటిల్ రివీల్ చేసింది చిత్ర యూనిట్ డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా.

సీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ చాలా సినిమాలు చేశారు. అందులో చాలా సినిమాలు మంచి విజయాల్నీ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో అదే సెంటిమెంటుతో ఈసారి కూడా సీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణతో సినిమా తెరకెక్కించినట్టున్నాడు.

వీర సింహా రెడ్డి.! డేట్ చెప్పలేదేం..?

తొలుత ‘రెడ్డిగారు’ అనే టైటిల్ అనుకున్నారు ఈ సినిమాకి. కానీ, చివరికి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్‌ని కన్ఫామ్ చేశారు. బాలయ్య సినిమాల్లో ‘సింహా’కి ఓ స్పెషల్ వుంది. ఆయన తన సినిమాల్లో ‘సింహా’ అని పెట్టుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.

ఇదిలా వుంటే, సంక్రాంతి విడుదల.. అంటూ చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్‌లో పేర్కొంది. సంక్రాంతి విడుదల అంటే ఎప్పుడు.? ప్రచారంలో వున్నట్లుగా సంక్రాంతికి దాదాపు వారం రోజుల ముందే అనుకోవచ్చా.? సంక్రాంతికే ‘మెగా 154’ సినిమా విడుదలవుతోంది కదా.? రెండు సినిమాల్నీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది కదా.?

డేట్ విషయంలోనే చిన్న గందరగోళం. ‘మెగా 154’ టైటిల్ ఈనెల 24న రివీల్ కానున్న దరిమిలా, రెండు సినిమాల రిలీజ్ డేట్లపై ఆ రోజే పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us