Nandamuri Balakrishna : భీమ్లా నాయక్ నాతో ఎందుకు చేయలేదు.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

NQ Staff - October 21, 2022 / 11:33 AM IST

Nandamuri Balakrishna : భీమ్లా నాయక్ నాతో ఎందుకు చేయలేదు.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ తాజా అన్‌ స్టాపబుల్ ఎపిసోడ్ లో సిద్దు జొన్నలగడ్డ మరియు విశ్వక్సేన్ పాల్గొన్న విషయం తెలిసిందే. అదే ఎపిసోడ్లో భీమ్లా నాయక్ చిత్ర నిర్మాత నాగ వంశీ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా మొదట మీరు చేయాల్సింది అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు.

ఆ సమయంలో నేనెందుకు భీమ్లా నాయక్ చేయలేదు నాతో ఎందుకు ఆ సినిమాను చేయలేదు అంటూ బాలయ్య ఎదురు ప్రశ్నించగా అప్పుడు మీరే సినిమాను పవన్ కళ్యాణ్ తో చేస్తే బాగుంటుందని అన్నారు కనుక ఆయనను సంప్రదించామంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు.

Nandamuri Balakrishna Latest Unstoppable Episode Interest Comments

Nandamuri Balakrishna Latest Unstoppable Episode Interest Comments

మూడు నాలుగు నెలల పాటు బాలకృష్ణ హీరోగా భీమ్లా నాయక్ సినిమా రూపొందబోతుంది అంటూ ప్రచారం బలంగా జరిగింది, కానీ చివరకు పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా తెరకెక్కింది. అందుకు కారణం బాలయ్య స్వయంగా ఆ స్క్రిప్ట్ కి పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడని భావించడమే అంటూ తాజాగా క్లారిటీ వచ్చేసింది.

నిజం గానే భీమ్లా నాయక్ స్క్రిప్ట్ కి పవన్ కళ్యాణ్ పూర్తి న్యాయం చేశాడు, బాలకృష్ణ చేసి ఉన్నా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకునేదేమో కానీ పవన్ కళ్యాణ్ చేయడం ద్వారా ఆ సినిమాకు మరింత అదనపు ఆకర్షణ జోడించినట్లయ్యింది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us