Nandamuri Balakrishna And Nara Chandrababu Naidu : చంద్రబాబుతో బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’.! పిక్స్ వైరల్.!

NQ Staff - October 4, 2022 / 03:22 PM IST

Nandamuri Balakrishna And Nara Chandrababu Naidu  : చంద్రబాబుతో బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’.! పిక్స్ వైరల్.!

Nandamuri Balakrishna And Nara Chandrababu Naidu  : నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ కోసం చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో రెండో సీజన్ షురూ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ కోసం ఈసారి కాస్త భిన్నంగా రాజకీయ నాయకుల్ని కూడా తీసుకొస్తున్నారు. నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కూడా.! ఆ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో చేస్తున్నారు.

తాజాగా, నందమూరి బాలకృష్ణ – నారా చంద్రబాబునాయుడు కలిసి వున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అన్‌స్టాపబుల్ షో నిమిత్తం ఈ ఇద్దరి కలయికా చోటు చేసుకుంది. టీడీపీ అధినేతతో, టీడీపీ ఎమ్మెల్యే ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో.. అంటే, అందులో ఎలాంటి సంచలనాలకు ఆస్కారముంటుందో ఏమో.!

వెన్నుపోటు గురించి ప్రస్తావిస్తారా.?

‘అన్‌స్టాపబుల్ షో’ ద్వారా చాలా విషయాలపై నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇస్తున్నారు, వచ్చే అతిథుల నుంచి స్పష్టత రాబడుతున్నారు. ప్రస్తుత రాజకీయాలు సహా, ఒకనాటి వెన్నుపోటు ఎపిసోడ్ విషయమై బాలకృష్ణ, చంద్రబాబు నుంచి ఎలాంటి విషయాలు రాబడతారన్నది చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబుతోపాటుగా నారా లోకేష్ కూడా ఈ టాక్ షోలో పాల్గొంటారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్‌స్టాపబుల్ తొలి సీజన్ సూపర్ సక్సెస్ కాగా, అంతకు మించి రెండో సీజన్ సక్సెస్ అవుతుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us