Namratha : దుబాయ్‌లో చిల్ అవుతున్న న‌మ్ర‌త‌, ఉపాస‌న‌.. నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఫొటోలు

 

Namratha : స్టార్ హీరోల మ‌ధ్యే కాదు వారి స‌తీమ‌ణుల మ‌ధ్య కూడా మంచి బాండింగ్ నెల‌కొని ఉంది. తాజాగా మహేశ్‌బాబు సతీమణి నమ్రత, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన దుబాయ్‌లో సందడి చేశారు. ‘దుబాయ్‌ ఎక్స్‌పో 2020’లో భాగంగా అక్కడికి వెళ్లిన వీళ్లు క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకొన్నారు. నమ్రత, ఆమె సోదరి శిల్పా, మనీశ్‌ మల్హోత్ర తదితరులకు ఉపాసన ప్రత్యేకంగా విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

namratha
namratha

‘‘ఇష్టమైన స్నేహితులతో రుచికరమైన భోజనం. నాకెంతో ఇష్టమైనవారితో దుబాయ్‌లో ఈ మధ్యాహ్నం సరదాగా గడిచింది. ఉపాసన.. అద్భుతమైన వంటకాలతో నీలా విందు ఎవ్వరూ ఇవ్వలేరు. మనీశ్‌.. ఈరోజు నిన్ను ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుకలే త్వరలో హైదరాబాద్‌లో మనందరం కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్‌’’ అని నమ్రత పోస్ట్ పెట్టింది.

‘‘సమయం ఎంతో సరదాగా గడిచిపోయింది. అతిత్వరలోనే మనం మళ్లీ హైదరాబాద్‌లో ఇలాగే కలుసుకోవాలి’’ అని ఉప్సీ రిప్లై ఇచ్చారు.ఇదిలా ఉంటే ఉపాస‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉంటే, కొత్త సంవత్సరానికి దుబాయ్‌లో ఆహ్వానం పలకనున్నారు మహేశ్‌బాబు. ప్రస్తుతం మహేశ్ దుబాయ్ ఉన్నారు.

namratha
namratha

రీసెంట్‌గా మ‌హేష్ మోకాలికి స‌ర్జ‌రీ జ‌ర‌గ‌గా, అది చిన్న‌ద‌ని నమ్రత వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అయితే మహేశ్‌ కాలిగాయం ఇప్పటిది కాదు. 2017లో ‘స్పైడర్‌’ చిత్రీకరణ అప్పుడు ఆ షూటింగ్‌లో గాయపడ్డారట. ఆ గాయమే ఇటీవల ‘సర్కారువారి పాట’ సాంగ్‌ షూట్‌లో తిరగబెట్టిందట. పెద్దగా విశ్రాంతి అవసరం లేని చిన్న సర్జరీ కాబట్టి చేయించేసుకున్నారని సమాచారం.

ఇక గౌతమ్, సితార పరీక్షలు మరో వారంలో పూర్తవుతాయట. ఆ తర్వాత పిల్లలతో సహా నమ్రత దుబాయ్‌ వెళతారు. వెకేషన్‌ ఎంజాయ్‌ చేసి, వచ్చే జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌ చేరుకుంటారని తెలిసింది. ఆ తర్వాత మహేశ్‌ ‘సర్కారువారి పాట’ షూట్‌లో పాల్గొంటారు.