Bigg Boss Season 7 : బిగ్ బాస్ సీజన్ 7 ను నాగార్జున చేస్తాడా? లేదా?
NQ Staff - December 19, 2022 / 05:18 PM IST

Bigg Boss Season 7 : తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన విషయం తెలిసిందే. రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే నాలుగు రెగ్యులర్ సీజన్ లు ఒక ఓటిటి సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.
బిగ్ బాస్ సీజన్ 6 నిన్నటితో పూర్తయింది. సీజన్ 7 కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సంబంధించి నాగర్జున హోస్ట్ గా చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులకు తాను తదుపరి సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించేందుకు సిద్ధంగా లేను అంటూ క్లారిటీ ఇచ్చేసాడట. అందుకు వారు కూడా కొత్త హోస్ట్ కోసం అన్వేషిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
అతి త్వరలోనే హోస్ట్ ఎవరు అనేది ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాగార్జున హోస్ట్ గా చేస్తాడా లేదా అని ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నారు. క్లారిటీ రావడానికి మరి కొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉంది.
మధ్యలో బిగ్ బాస్ ఓటిటి కూడా రాబోతుంది.. దానికైనా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి బిగ్బాస్ కి నాగార్జున కి బంధం తెగిపోబోతుంది అనేది బిగ్బాస్ ప్రేక్షకులకు బాధను కలిగిస్తోంది.