Bangarraju Trailer : బంగార్రాజు బావ‌గారు చూపుల‌తో ఊచ‌కోత కోసేస్తారు.. అదిరిపోయిన ట్రైల‌ర్

Bangarraju Trailer : ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్‌ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’.‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది క్యాప్షన్‌. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.

Nagarjuna Naga Chaitanya Krithi Shetty Bangarraju Trailer
Nagarjuna Naga Chaitanya Krithi Shetty Bangarraju Trailer

ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.గ‌త కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. కొద్ది సేప‌టి క్రితం మూవీ నుండి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో నాగ చైత‌న్య గంతంలో ఎప్పుడు క‌నిపించ‌ని విధంగా క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఇద్ద‌రు హీరోల యాస‌, మ్యాన‌రిజం ఆక‌ట్టుకుంటున్నాయి. బంగార్రాజు బావ‌గారు చూపుల‌తో ఊచ‌కోత కోసేస్తారు అనే డైలాగ్ అక్కినేని అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది. మాస్ లుక్ అవ‌తారంలో క‌నిపించ‌డ‌మే కాకుండా అమ్మాయిల‌తో నాగ చైత‌న్య చేసే ర‌చ్చ స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తుంది.

ఈ చిత్రంలో ఒకరు కాదు.. ఏకంగా 8మంది హీరోయిన్లు సందడి చేయనున్నారట. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్‌ లీడ్స్‌ కాగా ఫరియా అబ్దుల్లా స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. వీళ్లతో పాటు మీనాక్షి దీక్షిత్‌, దర్శన బానిక్‌, వేదిక, దక్ష నాగార్కర్‌, సిమ్రత్‌ కౌర్‌ వంటి హీరోయిన్లు కూడా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

ఇటీవలే సెన్సార్ పూర్తి చేస్తున్న బంగార్రాజు సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్‌గా జనవరి 14న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఊహించని ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.