Nagarjuna : బాబాయ్.. అబ్బాయ్.! నాగార్జున, ఎన్టీయార్ మధ్య మమకారమిది.!
NQ Staff - September 4, 2022 / 10:38 AM IST

Nagarjuna : స్వర్గీయ నందమూరి తారక రామారావు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళలా వుండేవారు. నందమూరి కుటుంబం, అక్కినేని కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే వున్నాయి.

Nagarjuna and NTR relation interesting update
సీనియర్ తరంలో ఎన్టీయార్, అక్కినేని కలిసి నటించారు. ఆ తర్వాతి జనరేషన్ విషయానికొస్తే, నాగార్జున – హరికృష్ణ కలిసి ఓ సినిమాలో నటించిన విషయం విదితమే. తన అన్న హరికృష్ణకి ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు (సెప్టెంబర్ 2) చెప్పారు నాగార్జున.
నాగార్జున బాబాయ్ ఖుదాగవా అంటే ఇష్టం.!
యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి నాగార్జున హిందీలో నటించిన ‘ఖుదాగవా’ అనే సినిమా అంటే ఇష్టమట. ఓ తెలుగు హీరో, హిందీ సినిమాలో ఎలా వుంటాడు.? అని ఉత్సుకతతో చూసిన సినిమా అట అది. ఆ విషయాన్ని ‘బ్రహ్మాస్త’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీయార్, నాగార్జున సమక్షంలోనే చెప్పాడు.
స్వర్గీయ ఎన్టీయార్ బిడ్డతో తాను కలిసి నటించాననీ.. ఆ హరికృష్ణ బిడ్డ ఇక్కడ నందమూరి తారకరమారావులానే మన ముందు వున్నారని నాగార్జున చెప్పడం గమనార్హం.
‘నాగార్జున బాబాయ్..’ అని ఎన్టీయార్ పిలవడం, తారక్‌ని అత్యంత అభిమానంతో హత్తుకోవడం.. అటు నందమూరి అభిమానులకీ, ఇటు అక్కినేని అభిమానులకీ బోల్డంత సంతోషాన్నిచ్చింది.