Nagababu : మెగాస్టార్ చిరంజీవిని కోహినూర్ వజ్రంతో పోల్చిన నాగబాబు.!

NQ Staff - October 7, 2022 / 08:44 AM IST

Nagababu : మెగాస్టార్ చిరంజీవిని కోహినూర్ వజ్రంతో పోల్చిన నాగబాబు.!

Nagababu : అన్నయ్యను ‘వజ్రం’ అని తమ్ముడు పేర్కొనడంలో వింతేముంది.? కానీ, ఇది ఒకింత ఆసక్తికరం. వజ్రం మెరుపు తగ్గిందని తమ్ముడు ఒప్పుకోవడమే ఆశ్చర్యం.

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా.

కోహినూర్ డైమండ్..

‘కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు పాలిష్ తగ్గితే మెరుపు తగ్గొచ్చు. కానీ, దాని వేల్యూ ఎప్పుడూ తగ్గదు. సరైన పాలిష్ (గాడ్ ఫాదర్) పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగుని తట్టుకోవడం కష్టం..’ అంటూ నాగబాబు ట్వీటేశారు.

నిజమే, 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి, ‘ఆచార్య’ రూపంలో తప్పులో కాలేస్తే.. అంతమాత్రాన, చిరంజీవి కెరీర్ ముగిసిపోయిందని అనుకోవడం పొరపాటే. కానీ, అంతటి అపార అనుభవంతో ‘ఆచార్య’ లాంటి సిల్లీ సినిమాని చిరంజీవి ఎలా చేయగలిగారన్న ప్రశ్న వస్తుంది కదా.?

చిరంజీవి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవడం (పరోక్షంగానే అయినా) జనసేన పార్టీకి కలిసొచ్చేలానే కనిపిస్తోంది. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌ని మెగా అభిమానుల కంటే జనసేన పార్టీనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అయినా, మెగా అభిమానులు.. జనసేన పార్టీ వేర్వేరు కాదని ఇటీవలే తీర్మానం కూడా జరిగిపోయింది కదా.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us