Naga Shaurya : షూటింగ్‌లో కళ్ళు తిరిగి పడిపోయిన హీరో నాగశౌర్య.! ఆసుపత్రికి తరలింపు.!

NQ Staff - November 14, 2022 / 03:57 PM IST

Naga Shaurya : షూటింగ్‌లో కళ్ళు తిరిగి పడిపోయిన హీరో నాగశౌర్య.! ఆసుపత్రికి తరలింపు.!

Naga Shaurya  : యువ నటుడు నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యాడు. షూటింగ్ సమయంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో, చిత్ర యూనిట్ ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం నాగ శౌర్యకు హైద్రాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో వైద్య చికిత్స అందుతోంది. అయితే, నాగ శౌర్య ఎందుకు అస్వస్థతకు గురయ్యాడన్న విషయమై స్పష్టత రావాల్సి వుంది.

విపరీతమైన వర్కవుట్లే కారణమా.?

స్వల్ప అస్వస్థత మాత్రమేననీ, నాగశౌర్యకి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన సన్నిహితులు చెబుతుండగా, షూటింగ్ సమయంలో కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణమేంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

విపరీతమైన వర్కవుట్ల కారణంగా వచ్చిన నీరసం వల్లనే నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోయాడా.? ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏమైనా వున్నాయా.? అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.

విషయం తెలుసుకున్న నాగ శౌర్య కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి వెళ్ళారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. నాగ శౌర్య హీరోగా ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us