Naga Chaitanya : ఏంటి చైతూ.. ఆ హీరోయిన్‌తో స్టేజీపై ముసిముసి న‌వ్వులు, ముచ్చ‌ట్లు ఏంది?

Naga Chaitanya : అక్కినేని నాగ చైత‌న్య‌.. స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత చాలా రిజ‌ర్వ‌డ్‌గా ఉంటూ వ‌స్తున్నాడు. స‌మంత మాత్రం సినిమాలు, సోష‌ల్ మీడియాలో వెరైటీ పోస్ట్‌లు చేస్తూ ర‌చ్చ చేస్తుంది. మరో వైపు నాగ చైతన్య వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. వాటి షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చైతూ బంగార్రాజు సినిమా ప్రమోషన్ లో ఉన్నాడు.

Naga Chaitanya romantic look over Daksha nagarkar
Naga Chaitanya romantic look over Daksha nagarkar

ఇటీవల మ్యూజికల్‌ నైట్స్‌ అనే ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుండగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ చోటుచేసుకుంది. ఆ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ ఉండగా వెనుక ఉన్న నాగ చైతన్య మెల్లగా తన పక్కనే నిల్చుని ఉన్న హీరోయిన్ దక్ష నాగర్కర్ వైపు చూశాడు. చైతూ రొమాంటిక్ చూపుకు అంతే రొమాంటిక్ రెస్పాన్స్ ను దక్ష నాగర్కర్ ఇచ్చింది.

చిన్నగా ఆమె కను బొమ్మలు ఎగరవేస్తూ చైతూ వైపు నవ్వుతూ చూడటం.. ఆ చూపుకు చైతూ సిగ్గుతో ముడుచుకు పోవడం అంతా వీడియోలో బందీ అయ్యింది. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ కొన్ని సెకన్ల వీడియోను నెటిజన్స్ రకరకాలుగా మీమ్స్ చేస్తుంటే మరి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మరి కొందరు ఏం చైతూ ఏం జరుగుతుంది.. దక్ష నాగర్కర్ తో పులిహోర కలుపుతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దక్ష నాగర్కర్ బంగార్రాజు సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఆమె సినిమాలో కనిపించేది కొద్ది సమయం మాత్రమే. అయినా కూడా సినిమా ప్రమోషన్ లో ఆమె భాగస్వామ్యం అయ్యింది. చిన్న పాత్రలో కనిపించిన దక్ష నాగర్కర్ ఎందుకు నీతో ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవుతుందని అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలేం జరుగుతుంది చినబాబు అంటూ అక్కినేని అభిమానులు కూడా కొందరు సరదాగా ప్రశ్నిస్తున్నారు.