Sanjay Leela Bhansali : అక్కినేని హీరో నాగ చైతన్య మెల్లమెల్లగా తన పరిధి పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో అలరించిన నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ మెట్లు ఎక్కాడు. ఈ సినిమా హిట్ అయితే చైతూకి వరుసగా బాలీవుడ్ ఆఫర్స్ రావడం ఖాయం. అయితే భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరైనా సంజయ్ లీలా భన్సాలీ అక్కినేని హీరో నాగచైతన్యతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

క్రేజీ ఆఫర్..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ.. యువ సామ్రాట్ నాగచైతన్యతో చేతులు కలుపనున్నట్లు తెలుస్తుంది. తాజాగా చైతన్య, సంజయ్ భన్సాలీని కలిశాడట. వీరిద్దరి కలియకలో ఓ మూవీ కోసం చర్చలు జరిగినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే గతంలో పుష్ప రిలీజ్ తరువాత.. బన్నీ కూడా సంజయ్ ను కలిశారు. వీరిద్దరు సినిమా చేయబోతున్నారని అనుకున్నారు. కాని ఇంత వరకూ అనౌన్స్ మెంట్ లేదు. ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.
ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 12న విడుదల కానుంది. ఆమీర్ ఖాన్ హీరోగా, కరీనా కపూర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. దీనితో పాటుగా నాగ చైతన్య, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ధూత అనే హార్రర్ వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. ఈ వెంటనే.. మానాడు ఫేం వెంకట్ ప్రభూ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడు యంగ్ హీరో.
వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉన్న నాగచైతన్య.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ..మంచి జోరుమీదున్నాడు. అయితే నాగచైతన్య స్పీడ్‌కు ఈ మధ్యే థాంక్యూ మూవీ బ్రేక్‌లు వేసింది. భారీ అంచనాలతో జూలై 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది.