Naga Chaitanya : ఎట్ట‌కేల‌కు స‌మంత‌తో విడాకుల‌పై స్పందించిన నాగ చైత‌న్య‌.. ఇద్ద‌రం హ్యాపీ అంటూ కామెంట్

Naga Chaitanya : గ‌త ఏడాది అంద‌రికి షాకింగ్ క‌లిగించిన అంశం ఏంటంటే.. స‌మంత‌, నాగ చైత‌న్య విడాకుల వ్య‌వ‌హారం.పదేళ్ల ప్రయాణం, నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వారిద్దరు కూడా వ్యక్తిగత నిర్ణయాల కారణంగా విడిపోవడం జరిగింది. ఒక విధంగా అభిమానులకు ఇది చేదు అనుభవమే అయినప్పటికీ కూడా చైతన్య సమంత ఇద్దరూ కూడా వారిని నచ్చినట్లుగా ఉండాలి అని నిర్ణయాలు తీసుకునే విడాకులు తీసుకున్నారు.

Naga Chaitanya about samantha and divorce issue
Naga Chaitanya about samantha and divorce issue

విడాకుల ప్రకటనకు నెలల ముందు నుండే సమంత-నాగ చైతన్య విడివిడిగా ఉంటున్నారు. మనస్పర్థలు అనంతరం ఒంటరి జీవితం మొదలుపెట్టారు. అక్టొబ‌ర్ 2న విడాకుల విష‌యం ప్ర‌క‌టించి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చారు. వీరి విడాకుల ఎపిసోడ్ లో హైడ్రామా చోటు చేసుకుంది. మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి. సమంత సదరు కథనాలు ఆపివేయాలని అభ్యర్థించారు. అయినా ఆగకపోవడంతో లీగల్ యాక్షన్ కి కూడా వెళ్లింది.

Naga Chaitanya about samantha and divorce issue
Naga Chaitanya about samantha and divorce issue

ఇక సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు చాలా బిజీ అయిపోయారు. ఒకవిధంగా విడాకులు అనంతరం సమంత ఎవరూ ఊహించని విధంగా తన నట జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్లో మరో స్థాయికి వెళ్లేలా సమంత సరికొత్త పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది. సమంత ప్ర‌స్తుతం యశోద చిత్రంతో బిజీగా ఉండ‌గా, నాగ చైతన్య బంగార్రాజు చిత్ర ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉన్నాడు.

నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న చిత్రం​ ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగార్రాజు మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అంతేకాదు నాగార్జున్‌, నాగ చైతన్యలు వినూత్నం మూవీని ప్రమోట్‌ చేస్తున్నారు.

తాజాగా బంగార్రాజు సినిమా ప్ర‌మోష‌న్ కార్యక్రమంలో త‌మ విడాకుల గురించి స్పందించారు నాగ చైత‌న్య‌. ఇది ఇద్ద‌రి మంచి కోసం తీసుకున్న నిర్ణ‌యం.ఆమె సంతోషంగా ఉంది, నేను సంతోషంగా ఉన్నాను. ఈ సిట్యుయేష‌న్‌లో ఇది ఇద్ద‌రికి మంచి విష‌య‌మే. అందుకు ఆ నిర్ణ‌యం తీసుకున్నాం అంటూ చైతూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.