Naga Chaitanya : సినిమా టిక్కెట్ల ఇష్యూపై స్మార్ట్ ఆన్స‌ర్ ఇచ్చిన నాగ చైత‌న్య‌

Naga Chaitanya : ఇటీవ‌లి కాలంలో వైసీపీ ప్ర‌భుత్వం ఢీ అంటే ఢీ అంటుంది. కొద్ది రోజులు ప‌వ‌న్‌తో ఢీ కొట్టిన వైసీపీ ఆ త‌ర్వాత చంద్ర‌బాబుని టార్గెట్ చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్‌పై విరుచుకుప‌డుతుంది. గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌ని టార్గెట్ చేస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అంతే కాదు సినిమా టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డ‌మే కాకుండా, థియేట‌ర్స్‌పై ఆక‌స్మిక దాడులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖులు మండిప‌డుతున్నారు.

Naga Chaitanya about ap movie tickets rates
Naga Chaitanya about ap movie tickets rates

సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఏపీ సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారం ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తుంది. బంగార్రాజు మూవీ విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న సినిమా టికెట్ల ధరల వ్యత్యాసాల వల్ల ఇబ్బందులు ఏమైనా వున్నాయా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు నాగార్జున‌ అలాంటిదేమి లేదని సమాధానం ఇచ్చారు నాగ్.

అలాగే టికెట్ల రేట్లు ఎక్కువ వుంటే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయని మిగిలిన వారి సంగతి తనకు తెలియదని తనకైతే ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు నాగార్జున. ఏపీలో టికెట్ల రేట్లతో తాను సంతోషంగానే వున్నానని… సినిమా టికెట్ల ధరలు పెరిగితే మంచిదేని ఆయన చెప్పారు. బంగార్రాజు సినిమాను ప్యాకెట్‌లో పెట్టుకొని ఉంచలేమని.. తన సినిమాకు ఎలాంటి సమస్యా లేదని నాగార్జున పేర్కొన్నారు.

ఇక తాజాగా నాగ చైత‌న్య ఈ ఇష్యూపై స్పందించాడు. నేను న‌టుడిని. నాకు ఎలాంటి స‌మ‌స్య లేదు. ఈ విష‌యంపై నిర్మాత‌ల‌ను అడ‌గండి. జీవో ఏప్రిల్లో వచ్చింది. మా సినిమా ఆగస్ట్ లో స్టార్ట్ అయ్యింది. ఆ ప్రకారమే బడ్జెట్ వేసుకున్నాం. కాబట్టి ఎలాంటి స‌మ‌స్య లేదంటూ తెలివిగా స‌మాధానం ఇచ్చాడు చైతూ.

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో ఈ మూవీ విడుదల వుంటుందా వుండదా అన్న అనుమానాలకు చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించి క్లారిటీ ఇచ్చింది.