Nabha Natesh : నభా నటేష్ ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటబ్బా.!
NQ Staff - January 10, 2023 / 12:36 PM IST

Nabha Natesh : ఔను కదా, నభా నటేష్‌కి ఏమయ్యింది.? గత కొంతకాలంగా ఆమె సినిమాల్లో కనిపించడంలేదు. సోషల్ మీడియాలో మాత్రం అడపా దడపా పోస్టులు పెడుతోంది. హాట్ అండ్ వైల్డ్ పొటోలు కూడా అప్లోడ్ చేసింది.
గత ఏడాది తాను పెద్దగా సినిమాల్లో కనిపించకపోవడానికి కారణాన్ని బయటపెట్టింది నభా నటేష్ తాజాగా. ఈ మేరకు ఆమె ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. నభా నటేష్ అభిమానులు, ఆమె రీ-ఎంట్రీ కోసం ఎదురుచూస్తే, ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
యాక్సిడెంట్ అయ్యిందట..

Nabha Natesh Shared Emotional Post On Social Media
నభా నటేష్ ఓ ఘోర ప్రమాదానికి గురైందట. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయట. షోల్డర్ సర్జరీ జరిగిందట. కొన్ని ఎముకలు విరగడంతో, చాలా కాంప్లికేషన్స్ వచ్చాయట.
గత ఏడాది తనకు చాలా కష్టంగా గడిచిందనీ, ఇష్టమైన సినిమాకి దూరమవ్వాల్సి వచ్చిందనీ పేర్కొంటూ నభా నటేష్, తన గాయం కనిపించేలా ఓ ఫొటోని కూడా పోస్ట్ చేసింది. గాయం తాలూకు గుర్తు మాత్రమే కనిపిస్తోంది.
అదన్నమాట నభా నటేష్, సినిమాలకు దూరమవడానికి కారణం. 2023లో మళ్ళీ సత్తా చాటుతానంటోంది నభా నటేష్.
I am here because of all your love. 🙏
It was not easy taking a back seat from work, from all of you…
I am back now! Thank you all for all the support you guys have given me ❤️❤️ pic.twitter.com/Mq6yk3qCjK— Nabha Natesh (@NabhaNatesh) January 10, 2023