Saraswathi : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకి మాతృవియోగం

NQ Staff - September 11, 2022 / 06:45 PM IST

Saraswathi  : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకి మాతృవియోగం

Saraswathi  : తెలుగు సినీ పరిశ్రమలో ఒకే రోజు రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన విషాద ఘటనను మర్చిపోకముందే, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృ వియోగం కలిగింది.

మణి శర్మ తల్లి సరస్వతి ఆదివారం సాయంత్రం చెన్నయ్‌లో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యల కారణంగా సరస్వతి కన్నుమూసినట్లు తెలుస్తోంది. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె మృతి చెందారు.

సోమవారం అంత్యక్రియలు..

Music Director Mani Sharma Mother Saraswathi Passed Away

Music Director Mani Sharma Mother Saraswathi Passed Away

సరస్వతమ్మ వయసు 88 ఏళ్ళు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మణిశర్మతో ఫోన్‌లో మాట్లాడి ఆయన్ని ఓదార్చారు.

సినీ సంగీత ప్రపంచంలో సంగీత దర్శకుడిగా మణిశర్మ తనదైన ప్రత్యేకతను సంతరించుకున్నాడు. కెరీర్ అటకెక్కిపోయిందనుకున్న తరుణంలో మళ్ళీ మణిశర్మ సత్తా చాటుతున్నారు. అనూహ్యంగా మళ్ళీ స్టార్ సంగీత దర్శకుడిగా, యువ సంగీత దర్శకులతో పోటీ పడుతున్నారాయన.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us