Anirudh Ravichandran : స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇంట విషాదం

NQ Staff - September 27, 2022 / 11:36 AM IST

Anirudh Ravichandran : స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇంట విషాదం

Anirudh Ravichandran  : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తాత ఎస్వీ రమణన్ మృతి చెందారు. 87 సంవత్సరాల రమణన్‌ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో వయో భారంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఆయన సోమవారం మరణించినట్లుగా

కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రమణన్‌ కెరియర్ ని ప్రారంభించి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. భక్తిరస డాక్యుమెంటరీలు చిత్రీకరించడం ఆయనకు ఆసక్తి.

ఎస్వీ రమణన్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు దక్కించుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె తనయుడు అనిరుద్ రవిచంద్రన్. తాత మరణంతో అనిరుద్ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది.

సంగీత దర్శకుడిగా ప్రస్తుతం సౌత్ లో టాప్ పొజిషన్లో ఉన్న అనిరుద్ రవిచంద్రన్ తాత ఎస్వీ రమణన్‌ మరణ వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆయన అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సోషల్ మీడియా ద్వారా పెద్ద సంఖ్యలో కోలీవుడ్ స్టార్స్ సంతాపం తెలియజేశారు

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us