Mukku Avinash Gave Good News Fans : గుడ్ న్యూస్ చెప్పిన ముక్కు అవినాష్.. త్వరలోనే అంటూ..!
NQ Staff - July 9, 2023 / 09:09 AM IST

Mukku Avinash Gave Good News Fans :
ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన చాలా కాలంగా బుల్లితెరపై అలరిస్తూనే ఉన్నాడు. జబర్దస్త్ తో మొదలైన ఆయన కెరీర్ ఇప్పుడు మొన్నటి వరకు స్టార్ మాలో కొనసాగింది. ఎన్నో ప్రోగ్రామ్ లు, రియాల్టీ షోలతో ఆయన అలరిస్తున్నాడు. ఇలా తన కామెడీతో మాస్టర్ ఆఫ్ కామెడీగా పేరు తెచ్చుకున్నాడు.
అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రకటించాడు. మేం ఇద్దరం త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం. మా ఇంట్లోకి పాపాయి లేదా బాబు రాబోతున్నాడు.
ఎవరికీ చెప్పొద్దని..
చాలా సంతోషంగా ఉంది. మా పెళ్లి అయిన ఏడాదిన్నర అవుతోంది. ఇంత త్వరగా తల్లిదండ్రులం అవుతామని అనుకోలేదు. మా తల్లిదండ్రులు ఎప్పటి నుంచో పిల్లల గురించి అడుగుతున్నారు. ఇప్పుడు వారికి మేం సమాధానం చెప్పాం. మూడు నెలలు వచ్చేదాకా ఎవరికీ చెప్పొద్దని డాక్టర్ అన్నారు.
అందుకే ఇన్ని రోజులు ఆగాము. ఇప్పుడు తనకు పూర్తి రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు. కాబట్టి మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నా షోలు త్వరలోనే మళ్లీ స్టార్ట్ కాబోతున్నాయి. మీ అందరినీ ఎప్పటికీ ఇలాగే అలరిస్తూ ఉంటాను. నన్ను ఆదరిస్తున్న వారందరికీ థాంక్స్ అంటూ చెప్పాడు అవినాష్.