Tollywood Heroes : పేరుకి బడాస్టార్ల పెద్ద సినిమాలు.. కానీ డిలేకి బ్రాండ్ అంబాసిడర్లు

NQ Staff - October 31, 2022 / 05:30 PM IST

Tollywood Heroes : పేరుకి బడాస్టార్ల పెద్ద సినిమాలు.. కానీ డిలేకి బ్రాండ్ అంబాసిడర్లు

Tollywood Heroes : ఓవైపు టాలీవుడ్‌ చిత్రాలు నేషన్‌ వైడ్‌ గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తూ గోల్డెన్ ఫేజ్‌ లో ఉన్నా, మరోవైపు బడా స్టార్ల సినిమాల విషయంలో డల్‌ ఫేజ్‌ను ఫేస్ చేస్తోంది. దాదాపు పెద్ద హీరోల మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ మూవీస్‌ సినిమాలన్నీ ఇంతా ఇంతా డిలే అవుతూనే వస్తున్నాయి

ప్రభాస్‌ హీరోగా మోస్ట్‌ ప్రెస్టేజియస్‌ మూవీ ఆదిపురుష్‌ ఎక్స్‌ పెక్ట్‌ చేయని విధంగా పోస్ట్‌ పోన్‌ అయింది. ఈ మైథాలజీ ప్రాజెక్ట్‌ తో సంక్రాంతి బరిలో నిలిచి రాధేశ్యామ్‌ తాలూకు నెగిటివిటీని తుడిచేసి తన స్టార్‌ డమ్‌ ని మరోసారి ప్రూవ్‌ చేసుకుంటాడని బాగా ఆశపడ్డారు యంగ్‌ రెబల్‌ స్టార్ హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌. కానీ ఓ వైపు చిరు, బాలయ్య, విజయ్‌ లాంటి పెద్ద హీరోల సినిమాలు పండక్కే రిలీజ్‌ అవుతుండడం, మరోవైపు త్రీడీ ఎఫెక్ట్‌ లాంటి టెక్నికల్ వర్క్స్‌ కూడా ఉండడంతో ఇక ఇప్పట్లో ఈ సినిమా రాదనే క్లారిటీ వచ్చేసింది.

ఇక ఆచార్య లాంటి డిజాస్టర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్ తో బాక్సాఫిస్‌ ను షేక్‌ చేస్తాడని మెగా ఫ్యాన్స్‌ తెగ నమ్మకంతో ఉన్నారు.

శంకర్‌ లాంటి భారీ దర్శకుడి డైరెక్షన్లో చరణ్‌ నటిస్తుండడంతో ఇక తిరుగేలేదని వెయిట్ చేయడం స్టార్ట్‌ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ కూడా ఆలస్యానికి పర్యాయపదంలా తయారయింది. సినిమాలో పీరియాడికల్‌ సీన్స్‌ కూడా ఉండడం ఓ రీజనైతే, శంకర్‌ భారతీయడు టూ షూట్‌ తోనూ శంకర్‌ బిజీగా ఉండడం మరో రీజన్‌. అఫ్‌ కోర్స్‌.. శంకర్‌ సినిమా అంటనే భారీతనానికి పెట్టిందిపేరు.

కంటెంట్ పరంగా, టెక్నికల్‌ గా కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కించడంలో ఎక్స్‌పర్ట్‌. కానీ అనుకున్నదానికన్నా మరీ ఇంతలా లేటవుతూ వస్తుండడంతో ఫ్యాన్స్‌ కాస్త డిజప్పాయింట్‌ గానే ఉన్నారు.

ఇక తారక్‌, కొరటాల ప్రాజెక్ట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పే అక్కరేలేదు. అఫీషియల్‌ గా అనౌన్సవడం తప్పితే అరఇంచు కూడా ముందుకు మూవ్ అయింది లేదు. సెట్స్‌ పైకి వెళ్లడం పక్కకు పెడితే ఇంకా స్క్రిప్ట్‌ పైనే వర్క్‌ జరుగుతోంది. కొన్నిరోజులుగా ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందన్న పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

రాజమౌళి సినిమాతో హిట్ కొట్టాక ఏ హిరోకైనా తన తర్వాతి చిత్రం ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్‌ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉండనే ఉంది. మరి త్రిబులార్‌ తర్వాత తారక్‌ క్రేజ్‌ దేశాలుదాటి మరీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది.

ఇలాంటి టైమ్‌ లో కొరటాల మూవీతో హిట్ కొట్టి జక్కన్న హీరోల సెంటిమెంట్‌ ని బ్రేక్‌ చేస్తాడా అని యంగ్‌ టైగర్‌ ఫ్యాన్స్‌ తో పాటు అన్ని ఇండస్ట్రీల ఆడియెన్స్‌ ఈగర్‌ గా వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్‌ మాత్రం ఇప్పట్లో ఎదరుచూపులకు ఏ మాత్రం పరదాదించేచాన్సులే కనపడట్లేదు. కనీసం సెట్స్‌ పై ఉన్నా ఇప్పుడుకాకపోయినా ఇంకొన్ని నెలలకయినా రిలీజవుతుందన్న ఆశయితే ఉండేది. కానీ కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకపోవడంతో అభిమానులు తలలు పట్టుకునే పరిస్థితొచ్చింది పాపం.

ఇక మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ అయితే షూట్‌ స్టార్టవగానే ఓ పవర్‌ ఫుల్‌ వీడియో రిలీజ్ చేసి హంగామా చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆ స్పీడ్‌ డల్లయింది, ప్రాజెక్ట్‌ స్లో అయింది. కొన్ని కో ఆర్డినేషన్‌ ఎర్రర్స్ వల్ల షూట్‌ ఇంతా ఇంతా ఆలస్యమవుతూ వస్తోందనేది లేటెస్ట్‌ టాక్‌. సినిమా స్టార్టింగ్‌ కి ముందే స్క్రిప్ట్‌ వర్క్‌ డిలే అవడంతో త్రివిక్రమ్‌ పై మహేష్‌ సీరియస్‌ అయ్యాడన్న గాసిప్స్‌ గట్టిగానే వినిపించాయి. తీరా సెట్స్‌ పైకెళ్లాక ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్‌ తో ఇంకా లేట్‌ అవుతుండడంతో సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌ గ్రాడ్యువల్ గా డల్ అవుతున్నారు.

ఇక ఫస్ట్‌ పార్టే ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ గా రిలీజై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన పుష్ప కి సీక్వెల్‌ గా రానున్న పార్ట్‌ టూ మీదున్న హైప్‌ అంతా ఇంతా కాదు. ఈ సీక్వెల్‌ ప్రాజెక్టుకి ఆగస్టులో పూజా కార్యక్రమాలు జరిగినా ఇంతవరకూ ఒక్క షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకోలేదు.

బన్నీ, సుకుమార్‌ కూడా మరే సినిమా మీద వర్క్‌ చేయకుండా ఈ మూవీ మీదే ఫోకస్‌ పెట్టారు. అయినా కూడా షూట్‌ ఇంత ఆలస్యం ఎందుకింత ఆలస్యం అవుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. సాధారణంగా ఫస్ట్‌ పార్ట్‌ కి అంత పెద్ద సక్సెస్‌ దక్కాక వీలైనంత తొందరగా పార్ట్‌ టూని ఫినిష్‌ చేసి, హైప్‌ ని క్యాచ్ చేసుకుని కలెక్షన్స్‌ కొల్లగొట్టాలని చూస్తారు. కానీ లెక్కల మాష్టారు సుక్కు మాత్రం ఏ లెక్కన ఇంత లేటయినా లైట్‌ తీసుకుంటున్నాడో తెలీట్లేదు మరి.

ఇలా ఒక్కో ప్రాజెక్ట్‌ మీదే బడా స్టార్స్‌ ఇన్నేసి రోజులు తీసుకుని ఇంత గ్యాప్‌ ఇచ్చేస్తుంటే తర్వాతి సినిమాల సంగతేంటి? ప్యారలాల్‌ గా మరో చిత్రమో, ఇంకో రెండు మూవీసో చేస్తున్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ బన్నీ, మహేష్‌, తారక్‌.. ఒప్పుకున్న ఒక్క సినిమా కోసమే ఇంత డిలే చేయడం అటు ఫ్యాన్స్‌ కీ, ఇటు ఇండస్ట్రీకి కాస్త ఇబ్బంది కలిగించే విషయమే.

మరి ఫేస్‌ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ ని ఓవర్‌ కమ్‌ చేసి ప్రాజెక్ట్స్‌ ని ముందుకు తీసుకెళ్తూ, అనుకున్న టైమ్‌ దాటినా కనీసం అటు ఇటుగా అయినా సినిమాను ఫినిష్‌ చేస్తే హైప్‌ కి తగ్గ మార్కెట్‌ ను అందిపుచ్చుకోవడమే కాకుండా అభిమానుల వెయిటింగ్‌ కి ఎండ్‌ కార్డ్ వేసినట్టవుతుంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us