Rajinikanth : రజనీకి హిట్ ఇచ్చేందుకు బడా స్టార్స్ సాయం. జైలర్ మూవీలో తలా ఓ రోల్
NQ Staff - January 11, 2023 / 09:33 AM IST

Rajinikanth : ఎంత మంది స్టార్ హీరోలొచ్చినా స్టయిలంటే రజనీదే. ఎందరు బడా హీరోలు బాక్సాఫీసును షేక్ చేసినా రికార్డుల మానియా అంటే తలైవాదే. మామూలుగా సెలవు, పండగలప్పుడు హీరోల సినిమాలు రిలీజయితే, రజనీ సినిమాలు రిలీజైనప్పుడు సెలవులిచ్చి మరీ పండగల్లా చేస్తారు. అదీ సూపర్ స్టార్ రేంజ్. ఒకప్పుడు రజనీ క్రేజును వాడుకుని, ఆయన రిఫరెన్సులు, ఆయన పంచ్ డైలాగులు, ఆయన మార్క్ సీన్లను వాడుకుని హిట్లు కొట్టేవాళ్లు హీరోలు. కానీ కొన్నాళ్లుగా సీన్ మారింది.
రోబో తర్వాత ఆ రేంజ్ హిట్ దక్కలేదు. కబాలి, కాలా,పేట, దర్బార్, అన్నాత్తె.. ఇలా ఏ మూవీ రజనీ మానియాను మ్యాచ్ చేయలేకపోయాయి. ఎలాంటి జానర్ ట్రై చేసినా ఆడియెన్సును ఎంటర్టెయిన్ చేయలేకపోయాయి. రోబో లాంటి విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీతో బంపర్ హిట్టిచ్చిన శంకర్ తోనే రోబో 2.0 తీసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో నెల్సన్ డైరెక్షన్లో వస్తోన్న నెక్ట్స్ మూవీ జైలర్ పైనే ఆశలు పెట్టుకున్నాడు తలైవా.

Mohanlal And Shivraj Kumar Are Sharing Screen with Rajinikanth
ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అన్ని భాషల్లోనూ అదిరిపోయే హిట్ దక్కాలని స్టార్ కాస్టింగ్ నుంచే కాంసంట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అఫీషియల్ గా అనౌన్సయిన మ్యాటరేంటంటే.. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ బడా హీరో శివ రాజ్ కుమార్.. వీరిద్దరూ జైలర్ మూవీతో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఈ మూడు భాషల్లోనూ బంపర్ ఓపెనింగ్స్ పక్కా. ఇక టాక్ ఏ మాత్రం బాగున్నా సౌత్ వైడ్ గా కలెక్షన్స్ ఓ రేంజులో రావడం గ్యారెంటీ.
మామూలుగానే సూపర్ స్టార్ స్క్రీన్ పై కనిపిస్తే ఆడియెన్సుకు పూనకాలే. ఇక కథలో ముఖ్యపాత్రల పరంగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి యాక్టర్స్ కూడా రజనీతో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇక థియేటర్లో మాస్ జాతరే.
నిజానికి మోహన్ లాల్, శివరాజ్ కుమార్.. ఇద్దరూ బిజీ యాక్టర్లే. సోలో హీరోలుగా తమ కథలతో వరుస సినిమాలు చేస్తున్న వాళ్లే. కానీ.. కేవలం రజనీ మీదున్న రెస్పెక్టుతో, ఆయనకు కమర్షియల్ గానూ హిట్ వస్తే బాగుంటుందన్న ఆశతో చేతులు కలిపారు. మరి వీరిద్దరి కాంట్రిబ్యూషన్ ఎంతవరకు కలిసొస్తుంది? జైలర్ మూవీ తలైవాకు ఏ రేంజ్ హిట్టిస్తుందో చూడాలి మరి.