Miss Puerto Rico And Miss Argentina : ఈ అందగత్తెలిద్దరూ పెళ్లి చేసుకున్నారోచ్.! ఎక్కడో తెలుసా.?

NQ Staff - November 3, 2022 / 03:54 PM IST

Miss Puerto Rico And Miss Argentina : ఈ అందగత్తెలిద్దరూ పెళ్లి చేసుకున్నారోచ్.! ఎక్కడో తెలుసా.?

Miss Puerto Rico And Miss Argentina : ఇద్దరూ అందగత్తెలే. అందగత్తెలంటే అలాంటిలాంటి అందగత్తెలు కాదు . ఒకరు మిస్ గ్రాండ్ అర్జెంటీనా. ఇంకొకరు మిస్ గ్రాండ్ ప్యూర్టోరికో. అవునండీ ఇద్దరూ అమ్మాయిలే. మనం చెప్పుకునేది ఈ అందమైన అమ్మాయిల గురించే.

2020లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొన్నారు. అప్పుడే ఇద్దరూ మొదటి సారి ఇద్దరూ కలిశారు. ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత కంబైన్డ్‌గా ఓ ఫేస్ బుక్ ఖాతా తెరిచారు.

మొదట స్నేహితులే.. అభిరుచులు కలవడంతో..

అప్పుడప్పుడూ వెకేషన్లూ, పార్టీలూ, పబ్‌లూ ఇతరత్రా అంశాలకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసేవారు. ఫ్రెండ్స్ అన్నాకా కామనే కదా అనుకున్నారంతా. కానీ, సడెన్‌గా మేం పెళ్లి చేసుకున్నామోచ్.! అని అధికారికంగా ప్రకటించారు.

పెళ్లి కూడా సాదా సీదాగా ఏమీ చేసుకోలేదు. ఎంగేజ్‌మెంట్ చేసుకుని, మరీ పెళ్లి చేసుకున్నారు. వారి ఎంగేజ్‌మెంట్, పెళ్లి వీడియోలూ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

అక్టోబర్ 28 (పెళ్లి రోజు) తమకు చాలా ప్రత్యేకమైన రోజు అని ప్రస్తావిస్తూ ఈ ఇద్దరు అందగత్తెలు ఓ అందమైన వీడియో పోస్ట్ చేశారు. ముద్దులూ, ముచ్చట్లతో కూడిన వీరి అన్యోన్య బంధం నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. దాంతో, ఈ వీడియోలూ, ఫోటోలకు సోషల్ మీడియాలో బోలెడన్ని లైకులూ, షేర్లూ, వ్యూస్ పోటెత్తాయ్.

ఇరు దేశాల్లోనూ స్వలింగ వివాహాలు ఏమీ తప్పు కాదు. సో, ఈ ఇద్దరి అందగత్తెల వివాహం అధికారికమే వారి వారి దేశాల్లో. అన్నట్లు ఇండియాలోనూ స్వలింగ్ సంపర్కం నేరం కాదని చట్టం చేశారు. కానీ, వివాహానికి మాత్రం అనుమతి లేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us